Vishwanath and Sons: కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సూర్య (Suriya) అటు కోలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో మంచి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ . మమిత బైజు(Mamitha Baiju), సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky atluri) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కోలీవుడ్లో ఆల్ టైం హిట్ సినిమాలలో ఒకటిగా ఈ సినిమా స్థానం సంపాదించుకుంది. అంతేకాదు ఈ చిత్రంతో మమిత బైజు కూడా అరుదైన ఘనత సంపాదించుకుంది. కేవలం 30 రోజుల్లోనే మూడోసారి రూ.200 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలలో భాగమై.. భారతీయ చలనచిత్ర రంగంలో ఈ రికార్డును అందుకున్న ఏకైక నటిగా కూడా ఈమె చరిత్రకు ఎక్కింది. అలాంటి ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి రాబోతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 11 2026 నుండి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది అంటూ సినిమా పోస్టర్ ను పంచుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ , మలయాళం భాషలో ఏకకాలంలో పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సూర్యనాథ్ గారపాటి, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.. ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ లపై ఏ స్థాయి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read:బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక ధనిక కుటుంబానికి చెందినవాడు. పేరున్న వ్యాపారవేత్త అయినా ఇండియా తరఫున ఒలంపిక్స్ లో పాల్గొని బంగారు పతకం గెలుస్తాడు. అందుకు కారణం తన బాల్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే. తల్లి (రాధికా శరత్ కుమార్) మాత్రం పెళ్లి చేసుకోవాలని ,వారసుడిని కనివ్వాలని ఒత్తిడి పెడుతూ ఉంటుంది . దాంతో అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఒక బాబును కని ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఊహించని రీతిలో ఆ చిన్నారి ఆరోగ్యానికి గురవుతాడు. చికిత్స చేసే క్రమంలో ఆ చిన్నారికి తల్లి అవసరం ఏర్పడుతుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ మళ్ళీ అమెరికా వెళ్తాడు సంజయ్. మరి తన బాబుకు జన్మనిచ్చిన తల్లి దొరుకుతుందా? ఆమె ఎవరు ?ఆమె ఇండియాకు రావడానికి అంగీకరిస్తుందా? సంజయ్ జీవితంలోకి మదన కామేశ్వరి (మమిత బైజు) ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.