E-Paper
Advertisement

అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?

అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?
Advertisement

Motorola Razr 2026: మొబైల్ మార్కెట్‌లో ఫోన్ల ట్రెండ్ మారుతోంది. కేవలం ఫీచర్లు ఉంటే సరిపోదు, చేతిలో పట్టుకుంటే పదిమందిలో లుక్ అదిరిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకే ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా.. స్టైలిష్ బైకర్ల కోసం, ఫ్యాషన్ ప్రియుల కోసం దిమ్మతిరిగే మోడల్‌తో ‘మోటరోలా రేజర్ 2026 స్వాలోవ్‌స్కీ ఎడిషన్’ను తీసుకొచ్చింది. చూడడానికి అచ్చం ఒక ఖరీదైన మేకప్ బాక్స్‌లా ఉండే ఈ ఫోన్.. టెక్నాలజీతో పాటు ఫ్యాషన్‌ను ఇష్టపడేవాళ్లకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది.

మెరిసిపోయే డిజైన్.. స్పెషల్ లుక్:

ఈ ఫోన్ వెనకాల చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. పాంటోన్ మెటోరైట్ కలర్‌లో లెదర్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ బ్యాక్ ప్యానెల్‌పై మొత్తం 35 సిల్వర్ నైట్ స్వాలోవ్‌స్కీ క్రిస్టల్స్‌ను చేతితో స్వయంగా అమర్చారు. అంతేకాదు.. ఫోన్ మడతపెట్టే హింజ్ దగ్గర మరో పెద్ద క్రిస్టల్‌ని సెట్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు లేదా క్లోజ్ చేసినప్పుడు ఈ క్రిస్టల్స్ మెరుస్తూ సూపర్ లుక్ ఇస్తాయి. అయినా సరే ఫోన్ బరువు మాత్రం కేవలం 188 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.

Advertisement

Also Read: స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!

అదిరిపోయే స్క్రీన్లు, పవర్‌ఫుల్ కెమెరా:

ఈ Motorola Razr 2026 ఫోన్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు స్క్రీన్లు ఉన్నాయి. బయట వైపు 3.63 అంగుళాల క్విక్ వ్యూ స్క్రీన్ ఉంటే.. లోపల తెరిస్తే ఏకంగా 6.96 అంగుళాల పెద్ద ఎల్టీపీవో డిస్ప్లే కనిపిస్తుంది. ఇది ఎండలో కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనకాల 50MP మెయిన్ కెమెరా, మరో 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. దీంతో ఫొటోలు, వీడియోలు చాలా క్లారిటీగా వస్తాయి.

పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్:

Advertisement

Motorola Razr 2026 కేవలం చూడడానికే కాదు.. పనితీరులో కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7450ఎక్స్ ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వస్తుంది. సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 4800mah బ్యాటరీని ఇచ్చారు. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. అంతేకాకుండా 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ధర ఎంత ఉండొచ్చు?

అమెరికాలో ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ధర సుమారు 899.99 డాలర్లుగా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఇది దాదాపు రూ.85,000 వరకు ఉండొచ్చు. అయితే మన దేశంలో దీనిని అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేస్తారు, అసలు ధర ఎంత ఉంటుందనే దానిపై కంపెనీ నుంచి ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ భారత్‌కు వస్తే మాత్రం.. ఫ్యాషన్ లవర్స్ నుంచి దీనికి విపరీతమైన క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!

Tags

Related News

కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడే అలవాటు ఉందా? అయితే మీ ఫోన్ బ్యాటరీ డేంజర్లో పడ్డట్టే!

ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!

స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!

ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ హ్యారీ పాటర్ ఫోన్ టీజర్.. డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

Big Stories

Advertisement
×