E-Paper
Advertisement

Broccoli Sprouts Benefits: శరీరాన్ని లోపల నుంచే శుద్ధి చేసే బ్రోకోలీ మొలకలు.. ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా తింటారు!

Broccoli Sprouts Benefits: శరీరాన్ని లోపల నుంచే శుద్ధి చేసే బ్రోకోలీ మొలకలు.. ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా తింటారు!
Advertisement

Broccoli Sprouts Benefits: సాధారణంగా చాలామంది ఇంట్లోనే గ్రీన్ టీ, నిమ్మరసం వంటి డిటాక్స్ డ్రింక్స్ తాగి శరీరాన్ని శుభ్రం చేసుకుంటుంటారు. అయితే ఇలాంటి డ్రింక్స్‌కు బదులు వంద రెట్లు శక్తివంతమైన ఒక సూపర్ ఫుడ్ గురించి మీకు తెలుసా? అదేనండీ.. బ్రోకోలీ మొలకలు. ఈ చిన్నపాటి మొలకల్లో సాధారణ బ్రోకోలీ కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడతాయి.

డిటాక్స్ కంటే వందరెట్లు శక్తివంతం:

బ్రోకోలీ మొలకలు ప్రత్యేకంగా శక్తివంతంగా ఉండటానికి కారణం సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం. సాధారణ బ్రోకోలీతో పోలిస్తే.. ఈ మొలకల్లో 100 రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయి. సల్ఫోరాఫేన్ కాలేయాన్ని ఉత్తేజపరచి, శరీరంలోని హానికరమైన రసాయనాలు, టాక్సిన్‌లు వేగంగా తొలగింపబడటానికి, మూత్రం ద్వారా బయటకు పంపడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల.. సాధారణ డిటాక్స్ డ్రింక్‌లు అందించే తాత్కాలిక శుభ్రత కంటే.. బ్రోకోలీ మొలకలు శరీరం లోపల నుంచే ప్రతి అవయవాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.

Advertisement

Also Read: పిల్లల్లో మొబైల్ వ్యసనానికి చెక్ పెట్టాలా? పేరెంట్స్ పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!

క్యాన్సర్ నిరోధక శక్తి:

సల్ఫోరాఫేన్ కేవలం టాక్సిన్‌లను తొలగించడం మాత్రమే కాదు.. మానవ శరీరంలో కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్‌గాను పనిచేస్తుంది. ఇది ఫేజ్-II డీటాక్స్ ఎంజైమ్‌లను ప్రేరేపించి, DNAకి హానికరమైన టాక్సిన్‌లను అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తుంది. దీంతో కణాల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడానికి సహాయపడుతుంది.

రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే:

Advertisement

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే ప్రతి ఒక్కరూ.. బ్రోకోలీ మొలకలను తమ డైట్‌లో చేర్చుకోవాలి. ఉదయం సలాడ్, సాండ్‌విచ్ లేదా జ్యూస్‌లలో కొద్దిగా ఈ మొలకలను వేసుకోవడం ద్వారా, శరీరాన్ని లోపల నుంచే శుభ్రం చేస్తూ, రోగ నిరోధక శక్తిని పెంపొందించవచ్చు. బ్రోకోలి మొలకలు చూడటానికి ఆకారంలో చిన్నవే అయినప్పటికీ.. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మాత్రం కీలక పాత్రదారి.

Also Read: సిల్వర్ స్క్రీన్ నుంచి కిచెన్ వరకూ.. ధురంధర్‌తో హిట్ అయిన ‘దూద్ సోడా’ రెసిపీ ఇదే!

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×