Horror Thriller OTT : అర్ధరాత్రి హర్రర్ మూవీని చూస్తే వచ్చే కిక్కు వేరు కదా. మామూలుగానే ఈ జానర్లో వచ్చే సినిమాకు విశేష సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఇక ఎంగేజింగ్ స్టోరీ, మర్చిపోలేని విధంగా ఉండే సినిమా అయితే దానికి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాంటి ఒక కల్ట్ హర్రర్ మూవీనే ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఊరికే ట్రెండ్ అయితే దాంట్లో చెప్పుకోవాల్సింది ఏం ఉంటుంది? ఈ మూవీ విడుదలైన 17 ఏళ్ళ తరువాత సదరు మూవీ ట్రెండింగ్ లోకి రావడం విశేషం. మరి ఇన్నేళ్ల తరువాత ఓటీటీలో దుమ్మురేపుతున్న ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అదా శర్మ నటించిన ఈ హర్రర్ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. దీన్ని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ‘1920’. 2008లో విడుదలైన ఈ సినిమాను ఒంటరిగా చూడాలంటే ఎంతటి ధైర్యవంతులకైనా వణుకు పుడుతుంది. అంత భయంకరంగా ఉంటుంది మరి మూవీ. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని చూసిన తర్వాత గది నుండి బయటకు రావాలంటే పార్ట్స్ ప్యాక్ అవుతాయి. ఈ కథ ఆర్కిటెక్ట్ అర్జున్ పాత్రను రజనీష్ దుగ్గల్, అతని భార్య లిసా (అదా శర్మ) చుట్టూ తిరుగుతుంది.
విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన ఈ హిందీ హారర్ థ్రిల్లర్ ‘ది ఎక్సర్సిస్ట్’ (1973) నుంచి ఇన్‌స్పైర్ అయ్యింది. రాజ్నీష్ దుగ్గల్ (అర్జున్ సింగ్ రాథోడ్), అదా శర్మ (లిసా సింగ్ రాథోడ్), ఇంద్రనీల్ సేన్‌గుప్త, రాజ్ జుట్షి, అమిన్ హాజీ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ -భట్ హారర్ యూనివర్స్ లో ఇదే మొదటి ఫిల్మ్. 7 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ప్రస్తుతం ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. IMDb రేటింగ్ విషయానికొస్తే, దీనికి 10కి 6.5 రేటింగ్ ఉంది. మీరు ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.
Read Also : మోస్ట్ అవైటింగ్ మలయాళ మూవీ ‘ఎకో’ ఓటీటీ విడుదల తేదీపై అఫిషియల్ అనౌన్స్మెంట్
1920 బ్రిటిష్ ఇండియాలో ఈ మూవీ స్టోరీ జరుగుతుంది. అర్జున్ సింగ్ రాథోడ్ (రాజ్నీష్ దుగ్గల్) ఒక యంగ్ ఆర్కిటెక్ట్. హిందూ రాజ్‌పుత్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అబ్బాయి లిసా (అదా శర్మ) అనే ఆంగ్లో-ఇండియన్ క్రిస్టియన్ అమ్మాయిని ఇష్టపడతాడు. వీళ్ళ ప్రేమను ఇద్దరి ఫ్యామిలీస్ వ్యతిరేకించినా కూడా పట్టించుకోకుండా, హీరోహీరోయిన్లు ఇంటర్-రిలిజియన్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక పాత మాన్షన్ ను కూల్చే పనిని అర్జున్ కు అప్పగిస్తుంది. కానీ ఆ మాన్షన్ ఎక్కడో మారుమూలన ఉంటుంది. వెళ్ళిరావడం కుదరదు, పైగా ఫ్యామిలీతో గొడవల కారణంగా అర్జున్, లిసా ఆ మాన్షన్‌లోకి వెళ్లి స్టే చేస్తారు. మొదట్లో అంతా నార్మల్‌గా ఉన్నా, క్రమంగా చిత్ర విచిత్ర సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతుంది. డోర్స్ స్వయంగా ఓపెన్ అవడం, ఫర్నిచర్ కదలడం, బ్లడ్ స్టెయిన్స్, డార్క్ షాడోస్ వంటివి చూసి లిసా భయపడుతుంది. ఆ తరువాత ఆమె బిహేవియర్ మారిపోతుంది. అది చూసి భయపడ్డ అర్జున్ ఆ మాన్షన్ హిస్టరీని దర్యాప్తు చేస్తాడు. 1920లో ఒక బ్రిటిష్ ఆఫీసర్, అతని భార్య మధ్య జరిగిన ఓ షాకింగ్ ఘటన బయట పడుతుంది. అదేంటి? హీరోయిన్ కు పట్టిన దెయ్యం ఎవరు? దాన్ని ఎలా వదిలించారు? అన్నది స్టోరీ.