E-Paper
Advertisement

Social Media Ban: ఏకంగా 47 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్ చేసిన ప్రభుత్వం, ఇక కష్టమే!

Social Media Ban: ఏకంగా 47 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్ చేసిన ప్రభుత్వం, ఇక కష్టమే!
Advertisement

ప్రపంచంలోనే మొదటిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టం సత్ఫలితాలను ఇస్తోంది. ఆస్ట్రేలియా దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎన్నో దేశాలను ఆలోచింపజేస్తుంది. గతేడాది డిసెంబర్ 10న ఈ చట్టం అమలులోకి రాగా.. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ నెట్‌వర్క్ నుంచి దాదాపు 47 లక్షల (4.7 మిలియన్లు) మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లను తొలగించినట్లు ఆస్ట్రేలియా ఇంటర్నెట్ రెగ్యులేటర్ వెల్లడించింది.

ఈ గణాంకాలను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ మీడియాతో వెల్లడించారు. ‘మా ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. ఇది ఆస్ట్రేలియా గర్వించదగ్గ విషయం. మేము ప్రపంచానికే దిక్సూచిగా నిలిచాం. ఇప్పుడు ఇతర దేశాలు కూడా మమ్మల్ని ఫాల్లో అవుతున్నాయి’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 10 నుండి 16 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఆస్ట్రేలియా చిన్నారికి సగటున రెండు కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నట్లు ఈ లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క మెటా (Meta) సంస్థే తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి సుమారు 5.5 లక్షల ఖాతాలను తొలగించినట్లు వివరించింది. గూగుల్ (యూట్యూబ్), టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా సంస్థలు కూడా పెద్ద ఎత్తున మైనర్ల అకౌంట్లను తొలగించాయి.

ఈ చట్టం ప్రకారం.. నిబంధనలు పాటించని కంపెనీలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు 33 మిలియన్ అమెరికన్ డాలర్లు) జరిమానా విధిస్తారు. అయితే, ఈ చట్టంలో పిల్లలకు లేదా తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానా విధించే నిబంధన లేదు. బాధ్యత మొత్తం ప్లాట్‌ఫారమ్‌లదే. రెడిట్ (Reddit) వంటి కొన్ని సంస్థలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Advertisement

చట్టం కఠినంగా ఉన్నప్పటికీ.. కొంతమంది పిల్లలు ఇంకా దొంగచాటుగా సోషల్ మీడియాను వాడుతున్నారని ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ తెలిపారు. ‘రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెట్టినంత మాత్రాన అందరూ దాన్ని పాటించరు.. కానీ అది ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇదీ అంతే’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిషేధం తర్వాత చిన్న పిల్లలు ఇతర చిన్న యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారా..? అనే అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అలాగే, ఈ చట్టం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై నిపుణులు దీర్ఘకాలిక అధ్యయనాన్ని ప్రారంభించారు.

ALSO READ: Steelbird Helmet: స్టీల్‌బర్డ్ నుంచి సరికొత్త హెల్మెట్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×