E-Paper
Advertisement

అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టం.. నిజమేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే

అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టం.. నిజమేనా? నిపుణలు ఏం చెబుతున్నారంటే
Advertisement

వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా బరువు నియంత్రణ, మంచి జీర్ణక్రియ, శక్తివంతమైన జీవనశైలికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఫిట్‌నెస్ అనేది చాలామందికి ఒక జీవన విధానంగా మారింది. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచే వ్యాయామం కూడా అతిగా చేస్తే కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక వ్యాయామం పురుషులు, మహిళల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు.

అధిక వ్యాయామం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం ఎందుకు పడుతుంది?

మన శరీరం శక్తి వినియోగాన్ని చాలా తెలివిగా నియంత్రిస్తుంది. శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు అది అందుబాటులో ఉన్న శక్తిని ముఖ్యమైన పనులకు మాత్రమే కేటాయిస్తుంది. ఈ పరిస్థితిలో సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పాటు శరీరంపై ఒత్తిడి కొనసాగితే ప్రజనన వ్యవస్థ పనితీరు దెబ్బతినవచ్చు. అంటే సంతోన్పత్తి సమస్య రావొచ్చు.

సమతుల్య వ్యాయామంతో ప్రయోజనాలు

Advertisement

మితంగా చేసే వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సరైన విధంగా వ్యాయామం చేస్తే శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అలాగే మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సరైన స్థాయిలో చేసే వ్యాయామం కొంతమందిలో సంతానోత్పత్తి అవకాశాలను కూడా పెంచవచ్చు.

ఫిట్‌నెస్‌ కోసం తీవ్రంగా చేస్తే సమస్యలే

కొంతమంది వేగంగా బరువు తగ్గాలని లేదా బాడీ బిల్డింగ్ చేయాలని కఠినంగా వ్యాయామం చేస్తుంటారు. ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో సరైన ఆహారం, విశ్రాంతి, రికవరీకి ప్రాధాన్యం ఇవ్వరు. దీంతో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని దెబ్బతీసి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

మహిళల్లో అధిక వ్యాయామం ఎలాంటి ప్రభావం చూపుతుంది?

Advertisement

తీవ్రమైన వ్యాయామం వల్ల మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటూ ఎక్కువ వ్యాయామం చేస్తే శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీంతో మెదడు శక్తి కొరతగా భావించి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది.

దీని ఫలితంగా నెలసరి చక్రం అసమానంగా మారవచ్చు. కొంతమందిలో నెలసరి పూర్తిగా ఆగిపోవచ్చు. చాలామంది దీన్ని ఫిట్‌నెస్ పరగా ఆరోగ్యకరమని అపోహ పడుతుంటారు. కానీ వైద్య నిపుణులు దీన్ని హెచ్చరిక సంకేతంగా చూస్తారు. నెలసరి సక్రమంగా లేకపోతే అండోత్పత్తి కూడా ప్రభావితమై గర్భధారణ అవకాశాలు తగ్గిపోవచ్చు.

Also Read: ఏ డ్రెస్ వేసినా స్లిమ్, ఎలిగెంట్ లుక్.. ప్లస్ సైజ్ మహిళల కోసం ఫ్యాషన్ టిప్స్

పురుషుల్లో కూడా సమస్యలు కనిపించవచ్చు

అధిక వ్యాయామం ప్రభావం మహిళలకే పరిమితం కాదు. పురుషుల్లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గే అవకాశం ఉంది. అలాగే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు), ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతాయి. ఈ పరిస్థితులు వీర్యకణాల నాణ్యతను తగ్గించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

సరైన సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం

ఫిట్‌నెస్, సంతానోత్పత్తి రెండూ కలిసి సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామంతో పాటు పోషకాహారం, సరిపడ నిద్ర, విశ్రాంతి, రికవరీకి ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ వ్యాయామం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం

మీ ఫేస్ కలర్ చామన ఛాయ.. అయితే ఈ 5 లిప్ స్టిక్ షేడ్స్ మీకు సరిపడవు

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

Big Stories

Advertisement
×