E-Paper
Advertisement

కడుపుతో ఉన్న కూతురిపై కసాయి తండ్రి క్రూరత్వం… రక్తాన్ని మరిగించే రివేంజ్ థ్రిల్లర్ సిరీస్

కడుపుతో ఉన్న కూతురిపై కసాయి తండ్రి క్రూరత్వం… రక్తాన్ని మరిగించే రివేంజ్ థ్రిల్లర్ సిరీస్

Sports Crime Drama OTT : ఓటీటీలో ప్రతి వారం కొత్త సిరీస్‌లు వచ్చినా, టాప్ 10లో నిలకడగా ఉండటం చాలా కష్టం. కానీ ఈ సిరీస్ అలాంటి అరుదైన విజయం సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో గత 5 వారాలుగా టాప్ 10లో స్థానం నిలబెట్టుకుంటున్న ‘గ్లోరీ’ ప్రస్తుతం భారీ ప్రశంసలు అందుకుంటోంది. ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ, పుల్కిత్ సామ్రాట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ యాక్షన్, డ్రామా, సస్పెన్స్ కలిపి ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

సిరీస్ కథ ఏమిటి ?

‘గ్లోరీ’ కథ బాక్సింగ్ కోచ్ చుట్టూ తిరుగుతుంది. ఒలింపిక్స్ స్వర్ణ పతకం గెలవాలనే ఆయనకున్న తీవ్రమైన కోరిక అతని కుటుంబాన్నే పూర్తిగా నాశనం చేస్తుంది. ఏదైనా ఒక లిమిట్ వరకూ ఓకే… ఆ లిమిట్ క్రాస్ అయితే అనర్థాలు. ఇక్కడ అచ్చం ఇదే పరిస్థితి నెలకొంటుంది. అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు. కానీ కోచ్ కోపిష్టి బిహేవియర్ వల్ల వాళ్ళు ఇంటిని వదిలి వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలోనే కుమార్తెపై దాడి జరగడం, అతని ప్రతిభావంతుడైన విద్యార్థి నిహాల్ సింగ్ హత్యకు గురికావడంతో కథ మరింత విషాదకరంగా మారుతుంది.

ఈ ఘటనల తర్వాత ఆయన ఇద్దరు కుమారులు దేవ్, రవి ఇంటికి తిరిగి వస్తారు. తమ సోదరిపై జరిగిన దాడి, నిహాల్ హత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలని నిర్ణయించుకుంటారు. నేరాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు, రహస్యాలు, దిగ్భ్రాంతికరమైన మలుపులు సిరీస్‌ను చివరి వరకు ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి.మరి కోచ్ కూతురుపై దాడి చేసింది ఎవరు? నిహాల్ హత్యకు కారణం ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానం కావలంటే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే.

ఎప్పుడు విడుదలైంది ?

7 ఎపిసోడ్ల ఈ సిరీస్ మే 1న నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వ్యూస్ సాధించి, ఇప్పటికీ టాప్ 10లో 6వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇది యువతకు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికీ నచ్చేలా ఉంటుంది. ఇందులో .దివ్యేందు శర్మ దేవ్ పాత్రలో (మిర్జాపూర్ మున్నా భయ్యా), పుల్కిత్ సామ్రాట్ – రవి పాత్రలో, జన్నత్ జుబేర్ రహ్మానీ – గుడియా (సోదరి) పాత్రలో నటించారు. అలాగే సయానీ గుప్తా, అశుతోష్ రాణా, సికిందర్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. నటీనటులు అందరూ తమ నటనతో సిరీస్‌ కు బలం చేకూర్చారు.

Also Read : నిర్జన ద్వీపంలో చిక్కుకుపోయే 8 మంది అమ్మాయిలు… కట్ చేస్తే ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్

IMDb రేటింగ్

ఐయండీబీలో 6.7 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ లో బంధాలు, న్యాయం కోసం పోరాటం వంటి లోతైన అంశాలను హార్ట్ టచింగ్ గా చూపించారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సిరీస్ ను ఒక్కసారి మొదలు పెడితే ఆపలేరు. ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడేవారు డోంట్ మిస్.

Tags

Related News

అమ్మాయి చస్తే ఇవేం సైకో పనులు భయ్యా… 8 ఎపిసోడ్ల మెంటల్ మాస్ క్రైమ్ థ్రిల్లర్

నిర్జన ద్వీపంలో చిక్కుకుపోయే 8 మంది అమ్మాయిలు… కట్ చేస్తే ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్

బాసిల్ జోసెఫ్ – టోవినో థామస్ ‘అతిరడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్

యూఫోరియా సీజన్ 3 క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్… చివరికి జరిగింది ఇదే

IMDbలో 8.2 రేటింగ్‌… మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ భయ్యా

జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్… ఇంటెన్స్ సస్పెన్స్‌ థ్రిల్లర్

Big Stories

×