Varanasi Movie: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి ‘ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజూ రకరకాల గాసిప్స్ , లీకులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతుంది.
వైరల్ అవుతున్న కథనాల ప్రకారం..లంకలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి వెళ్ళిన రాముడు, అక్కడ రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడితో జరిపే మహా యుద్ధం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని రాముడు-కుంభకర్ణుడు మధ్య సాగే ఆ అరగంట యుద్ధం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్‌గా నిలిచిపోతుందని రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఒక ఈవెంట్‌లో ఈ విషయాలను చెప్పుకొచ్చారు
ఈ చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ లార్జర్ దన్ లైఫ్ లార్డ్ రాముడి ఇన్స్పిరేషన్ తో ఉంటుందని, ముఖ్యంగా రామాయణంలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని రాజమౌళి తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారని ఆయన హింట్ ఇచ్చారు. సాధారణంగా రామాయణం నేపథ్యంలో వచ్చే సినిమాల్లో రాముడు-రావణుడు మధ్య జరిగే క్లైమాక్స్ యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ, జక్కన్న రూటే వేరు.
also read :జాన్వీ టు మీనాక్షి.. టాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మలుగానే హీరోయిన్లు?
ఆయన ఈ సినిమాలో రాముడు మరియు కుంభకర్ణుడి మధ్య జరిగే ఒక మహా యుద్ధాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, మునుపెన్నడూ చూడని రీతిలో చూపించబోతున్నారట. లంకలో బంధీగా ఉన్న సీతాదేవిని రక్షించడానికి వానర సైన్యంతో కలిసి వెళ్లిన రాముడి దాడికి రావణుడి సైన్యం కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో విలన్ కుంభకర్ణుడిని నిద్ర లేపి యుద్ధానికి పంపుతాడు. కొండలాంటి దేహంతో, అజేయమైన శక్తులతో ఉన్న ఆ కుంభకర్ణుడిని రాముడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దాదాపు అరగంట పాటు సాగే ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ గా రాజమౌళి డిజైన్ చేసినట్లు టాక్.
ఈ పర్టికులర్ 30 నిమిషాల వార్ సీక్వెన్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్ గా, సరికొత్త బెంచ్ మార్క్ గా నిలిచిపోతుందని విజయేంద్ర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. మహేష్ బాబుని రాముడి వంటి డివైన్ అండ్ పవర్ ఫుల్ గెటప్ లో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) బ్యాక్ డ్రాప్ లో కుంభకర్ణుడితో పోరాడే ఆ విజువల్స్ ని ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం.
ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచర్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఈ మైథలాజికల్ టచ్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని నమ్ముతున్నారు మూవీ లవర్స్.అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, టాప్-నాచ్ గ్రాఫిక్స్ కంపెనీలు ఈ ప్రాజెక్ట్ కోసం పగలూ రాత్రి కష్టపడుతున్నాయని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ మరియు ప్రీ-విజువలైజేషన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల కానుంది.చూడాలి మరి బాహుబలి, RRR చిత్రాలతో ఇండియన్ సినిమా జెండాను గ్లోబల్ బాక్సాఫీస్ పై ఎగరేసిన రాజమౌళి.. ఈసారి మహేష్ బాబుతో కలిసి ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో !
also read :మెగా ఇంట ‘పెద్ది’ సెలబ్రేషన్స్..హోరెత్తిపోయిన చరణ్ హోమ్ స్టాఫ్ మాస్ స్టెప్పులు.. క్లీంకార వాయిస్ ఓవర్ కేక!