E-Paper
Advertisement

Pocket money: పదేళ్ల పిల్లాడికి ప్యాకెట్ మనీ ఇవ్వచ్చా? వాటి వల్ల లాభనష్టాలేంటి?

Pocket money: పదేళ్ల పిల్లాడికి ప్యాకెట్ మనీ ఇవ్వచ్చా? వాటి వల్ల లాభనష్టాలేంటి?
Advertisement

ఆధునిక కాలంలో పిల్లలకు పాకెట్ మనీ అనేది అలవాటయింది. స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి కాలేజీ చదివే విద్యార్థుల వరకు ప్రతిరోజూ తల్లిదండ్రుల గురించి ఎంతో కొంత పాకెట్ మనీని తీసుకుంటున్నారు. ఇలా వారు తీసుకొని ఆ డబ్బులతో తమకు ఇష్టమైనవి కొనుక్కోగలుగుతున్నారు. తల్లిదండ్రులు ఇలా పాకెట్ మనీ ఇవ్వడం వల్ల వారు స్వతంత్రంగా ఆలోచిస్తారని, డబ్బు విలువను అర్థం చేసుకుంటారని భావిస్తారు. అయితే పాకెట్ మనీ ఇవ్వడం వల్ల నిజంగా పిల్లలకు మేలు జరుగుతుందా? దాని వల్ల వచ్చే చెడు అలవాట్లు ఏమిటి?

పాకెట్ మనీ సరైన విధంగా ఇస్తేనే
నిపుణులు చెబుతున్న ప్రకారం పాకెట్ మనీ సరైన విధంగా పిల్లలకు అందిస్తే.. భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అదే నియంత్రణ లేకుండా ఇస్తే అతిపెద్ద సమస్యలకు కారణమవుతుంది. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడంలో ప్రధానమైన కోణం డబ్బు విలువను వాళ్లకు నేర్పించడం. చిన్న వయసులోనే డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేయాలి? అనే విషయాలు పిల్లలకు నేర్చుకునేందుకు పాకెట్ మనీ ఉపయోగపడుతుంది. అయితే ఒక పరిమిత మొత్తంలోనే వారికి ఆ డబ్బును ఇవ్వాలి. అలాగే డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా.. అవసరమైతే కొంతకాలం దాచుకొని ఆ తర్వాత ఉపయోగించేలా వారికి నేర్పాలి. కొన్ని కుటుంబాల్లో పాకెట్ మనీ పిల్లలు పనిచేస్తే ఇస్తూ ఉంటారు. దీనివల్ల వారిలో బాధ్యత పెరుగుతుందని, శ్రమకు విలువ దక్కుతుందనే భావనలో బలపడతాయని చెబుతారు. డబ్బు సులువుగా రావడం కాదని, కష్టపడితేనే వస్తుందనే పాఠం వారికి తెలుపుతుందని భావిస్తారు. ఇది కొంతవరకు నిజమే. అయితే ఆ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత.

Advertisement

Also read: Night Shift: రాత్రి షిఫ్ట్ పని చేసే వారికి ఆ భయంకర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ?

పాకెట్ మనీ వల్ల కష్టనష్టాలు
అయితే పాకెట్ మనీ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. సరైన మార్గదర్శకం చేయకుండా పిల్లలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తే వారు అనవసర ఖర్చులకు అలవాటు పడతారు. ముఖ్యంగా రోడ్డు మీద దొరికే జంక్ ఫుడ్, అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటారు. డబ్బును వృధా చేస్తారు. అలాగే తమ స్నేహితులతో పోల్చుకొని ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అడుగుతూ ఉంటారు. ఇది వారి చెడుపోవడానికి మొదటి కారణం అవుతుంది. కాబట్టి మీరు డబ్బు ఇచ్చేటప్పుడు ప్రతిదీ వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో.. ఆ ఖర్చుకు తగ్గ లెక్కను కూడా తమకు చెప్పాలని వివరించాలి. డబ్బును బాధ్యతగా ఖర్చు పెట్టడం పిల్లలకు నేర్పితేనే మీరు పాకెట్ మనీ ఇవ్వండి. లేకుంటే ఇవ్వడం మానేయడమే ఉత్తమం.

Advertisement

పదేళ్ల వయసులో పాకెట్ మనీ?
పదేళ్ల వయసులోనే పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సి వచ్చినా 10 రూపాయలు కన్నా ఎక్కువ ఇవ్వకండి. ఆ పది రూపాయలకు కూడా లెక్క చెప్పమని అడగండి. దేనికోసం ఖర్చు పెట్టారో.. అలా ఖర్చు పెట్టడం వల్ల ఎలాంటి లాభనష్టాలు కలిగాయో వివరించమనండి. పిల్లల వయసు, అవసరాలను బట్టి పాకెట్ మనీ ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించుకోవాలి. ఇచ్చిన పది రూపాయలను కూడా ఎంత ఖర్చు పెట్టారు? ఎంత పొదుపు చేశారు? వంటివి కూడా పిల్లలను అడిగి తెలుసుకోండి. అంతా ఖర్చు పెట్టకుండా సగం పొదుపు చేయాలని ఒక కండిషన్ పెట్టండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు బాధ్యత కూడా తెలుస్తుంది. డబ్బును ఖర్చు పెట్టడమే కాదు, పొదుపు చేయడం కూడా ముఖ్యమైన వారికి అర్థమవుతుంది. పాకెట్ మనీని సరైన మార్గంలో సరైన నియంత్రణతో ఇచ్చినప్పుడే పిల్లల భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×