E-Paper
Advertisement

Jana Nayagan: దిగివచ్చిన మేకర్స్.. అదే డేట్ పై కన్ను!

Jana Nayagan: దిగివచ్చిన మేకర్స్.. అదే డేట్ పై కన్ను!
Advertisement

Jana Nayagan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy).. హెచ్ వినోత్ (H.Vinoth) దర్శకత్వంలో చేసిన చిత్రం ‘జననాయగన్’. ఈ చిత్రాన్ని తెలుగులో జన నాయకుడు.. హిందీలో జననేత అంటూ జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితులు ఇటు అభిమానులను కూడా అయోమయంలో పడేశాయి.

ముఖ్యంగా సెన్సార్ బోర్డుతో జరుగుతున్న న్యాయ పోరాటాల కారణంగానే ఎప్పటికప్పుడు సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాను తీసుకురావాలనుకున్నారు. కానీ మళ్ళీ వాయిదా పడింది. దాంతో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా రిలీజ్ తేదీన అనగా మార్చి 19న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాగా.. లేదు ఈ నెలలోనే రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

దిగొచ్చిన మేకర్స్.. ఏకంగా అలాంటి నిర్ణయం..

Advertisement

ఇప్పటికే ఈ సినిమాను సెన్సార్ బోర్డు సమర్పించినప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఏర్పడడం వల్లే సెన్సార్ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. మద్రాస్ హైకోర్టులో ఈ సెన్సార్ వివాదంపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. కోర్టు నుంచి తుది తూర్పు వెలువడిన తర్వాతే సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తుంది కాబట్టి అప్పటివరకు అధికారికంగా చిత్ర బృందం ఏ విషయాన్ని కూడా దృవీకరించలేరు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

అందులో భాగంగానే 20 నిమిషాల ఫుటేజ్ ను తొలగించడమే కాకుండా కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయబోతున్నారట. సెన్సార్ నుండి ఎటువంటి అడ్డంకులు లేకుంటే ఈ నెల 13న లేదా చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తమ ప్రొడక్షన్లో వచ్చే తర్వాత సినిమాల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

also read:Nani – Sujith: తెరపైకి ఫ్రెష్ జోడి.. నాని సరసన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

విజయ్ దళపతి కెరియర్..

విజయ్ దళపతి సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ఇది ఆయన కెరియర్ లో చివరి చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమా పూర్తి చేసి ఆయన తన జీవితాన్ని పూర్తిగా రాజకీయానికే పరిమితం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీకే పార్టీని స్థాపించారు విజయ్ దళపతి. ఈ పార్టీతో వచ్చే ఎన్నికలలో తమిళనాడులో అధికారంలోకి రావాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన సినిమా విడుదల ఆగిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు గనుక మేకర్స్ వెనక్కి తగ్గకపోతే ఈ సినిమా విడుదల చేయడం ఒక కుదరని పని అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో తమిళనాడులో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది ..ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమా విడుదల ఇక వాయిదా పడే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×