E-Paper
Advertisement

Dhurandhar: దురంధర్ మూవీని రాహుల్ గాంధీ నిర్మించారా? టైటిల్స్‌లో ఆ పేరు చూసి అంతా షాక్!

Dhurandhar: దురంధర్ మూవీని రాహుల్ గాంధీ నిర్మించారా? టైటిల్స్‌లో ఆ పేరు చూసి అంతా షాక్!
Advertisement

Dhurandhar: బాలీవుడ్‌ దురంధర్ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయం కొంతమందికి గందరగోళం కలిగిస్తూ ఉండగా.. మరి కొంతమందికి మాత్రం నవ్వు కూడా తెప్పించింది. ఏదేమైనా సోషల్ మీడియా మొత్తం ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం మాత్రం తెగ వైరల్ గా అయింది. ఆ విషయం ఏంటంటే… రణవీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ధురంధర్ సినిమా క్రెడిట్స్‌లో నిర్మాతగా..రాహుల్ గాంధీ పేరు పడదం. దురంధర్ సినిమా ఏమిటి రాహుల్ గాంధీ నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా..? ప్రస్తుతం ఇదే ఆశ్చర్యం అందరికీ కలుగుతోంది. ఈ సినిమా టైటిల్ క్రెడిట్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..రాహుల్ గాంధీ అనే పేరు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సినిమా చూస్తూ చివర్లో క్రెడిట్స్ వచ్చినప్పుడు ఆ పేరు చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిజంగానే రాజకీయాలను వదిలి బాలీవుడ్‌లోకి వచ్చారా? సినిమాలకు ప్రొడ్యూసర్ అయ్యారా? అనే సందేహాలు మొదలయ్యాయి. వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. “రాజకీయాల నుంచి సినిమా రంగానికి రాహుల్ గాంధీ” అంటూ జోకులు, సరదా పోస్టులు వైరల్ అయ్యాయి.

Advertisement

కానీ ఈ వార్త వెనుక అసలు నిజం వేరే ఉంది. సినిమాకి సంబంధించిన క్రెడిట్స్‌లో ఉన్న రాహుల్ గాంధీ..రాజకీయ నాయకుడు కాదు. ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. పేరు ఒకటే కావడంతో చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ ప్రొడ్యూసర్ రాహుల్ గాంధీ ఇప్పటికే ఎన్నో ప్రముఖ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు పని చేశారు. లక్కీ భాస్కర్, వెదా, ఫర్జీ, రాకెట్ బాయ్స్, రుస్తమ్ వంటి హిట్ ప్రాజెక్ట్స్‌లో ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేదా ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. కాబట్టి రాజకీయాలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం పేరు పోలిక వల్ల వచ్చిన అపోహ మాత్రమే.

ఇక ‘ధురంధర్’ సినిమా విషయానికి వస్తే.. ఇది ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

ఈ సినిమా విజయం తర్వాత ధురంధర్ 2 కూడా ప్రకటించారు. అది మార్చి 19న విడుదల కానుంది. మొత్తానికి, సోషల్ మీడియాలో వైరల్ అయిన రాహుల్ గాంధీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విషయం మాత్రం తెగ వైరల్ అవుతుంది.

ALSO READ: Ajith Kumar -Anil Sunkara: అనిల్ సుంకర నిర్మాణంలో అజిత్ కుమార్.. రంగంలోకి క్రేజీ డైరెక్టర్?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×