E-Paper
Advertisement

Cancer Symptoms in Women: మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు.. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Cancer Symptoms in Women: మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు.. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Advertisement

Cancer Symptoms In Women: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు తమ ఆరోగ్యం కంటే.. కుటుంబ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో శరీరంలో కలిగే చిన్నపాటి మార్పులను సాదాసీదా నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే.. కొన్ని అసాధారణ మార్పులు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు సంకేతాలు కావచ్చు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ వంటివి ప్రారంభంలోనే గుర్తిస్తే 90 శాతం పైగా నయం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మహిళా తప్పని సరిగా గమనించాల్సిన 5 హెచ్చరికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. రొమ్ములో మార్పులు లేదా గడ్డలు:
మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించేది రొమ్ము క్యాన్సర్.

Advertisement

లక్షణాలు: రొమ్ములో నొప్పిలేని గడ్డలు ఏర్పడటం, చర్మం రంగు మారడం (నారింజ తొక్కలాగా మారడం), లేదా నిపుల్స్ నుంచి అసాధారణ ద్రవాలు రావడం.

జాగ్రత్త: ప్రతి నెలా ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ చేసుకోవడం వల్ల మార్పులను త్వరగా గుర్తించవచ్చు.

Advertisement

2. అసాధారణ రక్తస్రావం:
మెనోపాజ్ (ముట్లు ఉడగడం) వచ్చిన తర్వాత రక్తస్రావం కావడం లేదా రెండు పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం సాధారణం కాదు.

ఇది గర్భాశయ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు.

రక్తస్రావం కావడం లేదా విపరీతమైన దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంటే.. వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

3. నిరంతర పొత్తికడుపు ఉబ్బరం:
చాలామంది మహిళలు కడుపు ఉబ్బరాన్ని జీర్ణ క్రియ సమస్యగా భావిస్తారు. కానీ మూడు వారాల కంటే.. ఎక్కువ కాలం పాటు కడుపు ఉబ్బరంగా ఉండటం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం అండాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ముదిరే వరకు బయటపడదు.

4. వివరించలేని బరువు తగ్గడం:
ఎటువంటి వ్యాయామం లేదా డైటింగ్ చేయకుండానే.. హఠాత్తుగా 5 కేజీలు లేదా అంతకంటే.. ఎక్కువ బరువు తగ్గడం ఆందోళన కలిగించే విషయం. ఇది ప్యాంక్రియాటిక్, స్టమక్ లేదా లంగ్ క్యాన్సర్‌కు ప్రాథమిక సంకేతం కావచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగేటప్పుడు అవి శరీర శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు.

5. చర్మంపై మార్పులు, విపరీతమైన అలసట:
చర్మంపై ఉన్న పుట్టుమచ్చలు రంగు మారడం, వాటి పరిమాణం పెరగడం లేదా దురద రావడం చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు. అలాగే.. తగినంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన అలసట కూడా అంతర్గత క్యాన్సర్లకు సంకేతం కావచ్చు.

నివారణ, స్క్రీనింగ్ పరీక్షలు:
క్యాన్సర్‌ను జయించాలంటే.. అవగాహనే ఆయుధం.

Pap Smear: గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు కోసం.

Mammogram: 40 ఏళ్లు దాటిన మహిళలు ఏటా చేయించుకోవాలి.

HPV Vaccine: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి చిన్న వయసులోనే టీకా తీసుకోవడం మంచిది.

పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినంత.. మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు. కానీ అవి ఒక హెచ్చరికగా.. భావించి మెడికట్ పరీక్షలు.. చేయించుకోవడం అవసరం.. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×