రైళ్లలో ప్రయాణించేవారికి రైలు చివరి బోగీపై పెద్దగా X గుర్తు కనిపించే ఉంటుంది. అసలు ఇది ఎందుకు పెడతారో.. దీని వెనకున్న అసలు కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. నిజానికి ఈ ఎక్స్ గుర్తు రైల్వే భద్రతకు చాలా ముఖ్యమైన విషయం. భారతీయ రైల్వే వ్యవస్థలో దీన్ని భద్రత సూచికగా ఉపయోగిస్తారు. ఈ చిన్న గుర్తుతో పెద్ద ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
ఎక్స్ గుర్తుకు ఏమిటర్థం
రైలు ఒక స్టేషన్ దాటి వెళ్లిన తర్వాత అక్కడ పని చేసే స్టేషన్ మాస్టర్, గేట్ మెన్, ట్రాక్ మెయింటేనెన్స్ చేసేవాళ్ళు రైలు పూర్తిగా వెళ్లిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలి. అప్పుడు చివరి భోగిపై ఉన్న ఎక్స్ గుర్తు వారికి స్పష్టమైన సంకేతాన్ని అందిస్తుంది. ఎక్స్ గుర్తు ఉన్న బోగీ కనిపించిందంటే ఆ రైలు మొత్తం రైల్వేస్టేషన్ నుంచి సురక్షితంగా దాటి వెళ్లిందని అర్థం. ఒకవేళ మధ్యలో ఏదైనా బోగీ విడిపోయి వెనుక మిగిలిపోయినట్లయితే చివర్లో ఎక్స్ గుర్తు కనిపించదు. అప్పుడు వెంటనే రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం ఇస్తారు. ఒక చిన్న గుర్తు రైలు కదలికలను పర్యవేక్షించేందుకు ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Also read: Chilli Paneer Recipe: చైనీస్ స్టైల్‌లో చిల్లి పనీర్ రెసిపీ, దీన్ని ఎలా చేయాలంటే
ప్రయాణంలో బోగీలు విడిపోయినప్పుడు లేదా సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు చివరి బోగి గుర్తింపును చాలా ముఖ్యం రైలు. చివర ఎక్స్ గుర్తు లేకపోవడం సిబ్బంది గమనిస్తే వెంటనే ప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు మొదలుపెడతారు. పగటి వేళల్లో ఎక్స్ గుర్తుతో పాటు లాస్ట్ వెహికిల్ బోర్డును కూడా ఉంచుతూ ఉంటారు. అదే రాత్రి వేళల్లో లేదా పొగ మంచు ఉన్న సమయంలో చివరి బోగిపై ఎరుపు రంగు లైటు పడేలా ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ కూడా రైలు పూర్తిగా, సురక్షితంగా రైల్వే స్టేషన్ దాటింది అనే విషయాన్ని నిర్ధారించేందుకే.
Also read: Diabetes: వందేళ్ల క్రితం భయంకరమైన వ్యాధి డయాబెటిస్, కానీ ఈ ఔషధంతో అంతా మారిపోయింది
రాత్రిపూట కూడా కనిపించేలా
ఈ ఎక్స్ గుర్తు రాత్రి పూట కూడా చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని రిఫ్లెక్టివ్ పెయింట్ తో వేస్తారు. రాత్రి సమయంలో వర్షం పడినప్పుడు, పొగ మంచు ఉన్నా కూడా ఈ ఎక్స్ గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. రోజు వేలాది రైళ్లు పరుగులు పెట్టే రైల్వే వ్యవస్థలో చిన్న చిన్న భద్రతా లోపాలే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతాయి. అందుకే చివరి బోగీపై ఎక్స్ గుర్తు వేయడం ఒక భద్రతా చర్య. ప్రయాణికులు దీన్ని సాధారణంగా పట్టించుకోరు. రైల్వే సిబ్బందికి మాత్రం ఈ ఎక్స్ గుర్తు ఎంతో ముఖ్యమైనది. రైలు స్టేషన్ కు వచ్చిన ప్రతిసారీ దాని వెనుక ఉన్న ఎక్స్ గుర్తును చూశాకే అక్కడ ఉన్న సిబ్బంది తేలికపడతారు.