E-Paper
Advertisement

Raakaasaa Glimpse: భయపెట్టేస్తున్న సంగీత్ శోభన్ రాకాసా గ్లింప్స్..

Raakaasaa Glimpse: భయపెట్టేస్తున్న సంగీత్ శోభన్ రాకాసా గ్లింప్స్..
Advertisement

Raakaasaa Glimpse: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థను స్థాపించి 10 సంవత్సరాలవుతుంది ఇప్పటికీ వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక తన నిర్మాణ సంస్థలో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో నిహారిక అంతే ఉత్సాహంతో తన రెండో సినిమాని కూడా ప్రకటించారు. సంగీత్ శోభన్ (Sangeeth Sobhan)హీరోగా రాకాసా(Raakaasaa) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ విడుదల చేయగా తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.

ఆకట్టుకుంటున్న రాకాసా గ్లింప్స్..

మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయాన్ సారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా
ఫాంటసీ కామెడీ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్ విడుదల చేయగా ఇది కాస్త ప్రేక్షకులను భయపడే విధంగా ఉందని చెప్పాలి. ఈ గ్లింప్స్ వీడియోలో సంగీత్ శోభన్ ను వీరుడిగా పరిచయం చేశారు .అయితే ఆయన ఉన్నఫలంగా వలలో చిక్కుకుపోవడంతో ఎదురయ్యే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో చూస్తుంటే సంగీత్ మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.ఈ గ్లింప్స్ వీడియో చూస్తుంటేనే హీరో ఖాతాలో మరొక హిట్ పడుతుందని చెప్పాలి. ఈ సినిమాను ఏప్రిల్ 3,2026 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.

నిర్మాతగా నిహారిక..

Advertisement

ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తున్నా నేపథ్యంలో మెల్లిగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతూ సినిమా నుంచి పలు అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ ఇప్పటికే పలు సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే రాకాసా సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నాయి. ఇక ఈ సినిమాని నిహారికతో పాటు జీ స్టూడియోస్ బాగాస్వామ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి సినిమాతో ఎంత మంచి సక్సెస్ అందుకున్న నిహారిక ఈ సినిమా ద్వారా కూడా అంతే సక్సెస్ అందుకోవాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటనపై ఆసక్తితో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయిన ఈమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు. వెబ్ సిరీస్ ల ద్వారా నిర్మాతగా సక్సెస్ అందుకోవడంతో సినిమాలపై దృష్టి సారించి ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగా కొనసాగుతున్నారు. కమిటీ కుర్రోళ లాంటి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిహారిక రెండో సినిమాని కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read; Om Shanti Shanti Shantihi: ‘ఓం శాంతి శాంతి శాంతి’ ట్రైలర్.. గోదారోళ్లకు ఎటకారాలే, ప్రతీకారాలు సూట్ కావు!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×