E-Paper
Advertisement

Stomach pain: దీర్ఘకాలిక కడుపు నొప్పి? ఈ సమస్యలు కారణం కావచ్చు!

Stomach pain: దీర్ఘకాలిక కడుపు నొప్పి? ఈ సమస్యలు కారణం కావచ్చు!
Advertisement

stomach pain: కడుపు నొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య అని మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తాం. కానీ.. నొప్పి తరచుగా వస్తున్నా లేదా దీర్ఘకాలంగా వేధిస్తున్నా అది ఒక పెద్ద అనారోగ్యానికి సంకేతం కావచ్చు. కేవలం గ్యాస్ సమస్య వల్లే కాకుండా.. లోపల అవయవాల పనితీరులో లోపాలు ఉన్నప్పుడు కూడా కడుపు నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎక్కడ వస్తోంది. ఏ సమయంలో వస్తోంది అనే అంశాలను బట్టి అది ఏ సమస్యో గుర్తించవచ్చు. సకాలంలో కారణాన్ని తెలుసుకోవడం ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది.

కడుపు నొప్పి వెనుక ఉన్న కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇవే..

Advertisement

గ్యాస్ట్రిటిస్, అల్సర్లు: కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి ఉంటే అది గ్యాస్ట్రిక్ లేదా పేగుల్లో అల్సర్లు కావచ్చు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇది వస్తుంది.

పిత్తాశయ రాళ్లు: కడుపుకు కుడివైపు పైభాగంలో నొప్పి వచ్చి, అది వెనుక వీపు వరకు పాకుతుంటే పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని అనుమానించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఈ నొప్పి పెరుగుతుంది.

Advertisement

అపెండిసైటిస్: కడుపుకు కుడివైపు కింద భాగంలో విపరీతమైన నొప్పి వస్తే అది అపెండిసైటిస్ కావచ్చు. ఇది అత్యవసర పరిస్థితి.

కిడ్నీ రాళ్లు: కడుపుకు రెండు వైపులా లేదా వెనుక భాగంలో నొప్పి రావడం కిడ్నీ సమస్యలకు సంకేతం.

IBS: మలబద్ధకం లేదా విరేచనాలతో పాటు వచ్చే కడుపు నొప్పి పేగుల సమస్యను సూచిస్తుంది.

స్త్రీలలో సమస్యలు: గర్భాశయ సంబంధిత సమస్యలు లేదా పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు కూడా దీర్ఘకాలిక నొప్పికి కారణమవుతాయి.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×