E-Paper
Advertisement

Love Story OTT: అబ్బాయితో ప్రేమ… స్కూల్ అయిపోగానే బయట పడే అసలు రంగు… క్రేజీ వైరల్ స్టోరీ

Love Story OTT: అబ్బాయితో ప్రేమ… స్కూల్ అయిపోగానే బయట పడే అసలు రంగు… క్రేజీ వైరల్ స్టోరీ
Advertisement

Love Story OTT : మలయాళ సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ వేరు. ఒకప్పుడు వీటికి అంతగా ఆదరణ ఉండేది కాదు. ఈ మధ్య ఇవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక ఫీల్ గుడ్ మూవీ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది మలయాళంలో సూపర్ హిట్ కూడా అయింది. ఈ కథ ఒక 16 ఏళ్ల స్కూల్ అమ్మాయితో మొదలవుతుంది. చూస్తున్నంత సేపు చూపు తిప్పుకోకుండా చేస్తుంది ఈ సినిమా. చిననాటి జ్ఞాపకాలు మాత్రం గుర్తుకు వస్తూ ఉంటాయి దీనిని చూస్తున్నంత సేపు. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2019లో వచ్చిన ఈ సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘జూన్’ (June). తెలుగులో ‘హలో జూన్’ (Hello June) పేరుతో విడుదలైంది. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో నటించగా, జోజు జార్జ్, సర్జానో ఖలీద్, అర్జున్ అశోకన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు వెర్షన్ ‘హలో జూన్’ ప్రస్తుతం Aha (ఆహా) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్ Jio Hotstarలో చూడవచ్చు. 2019లో మలయాళంలో విడుదలైన ‘జూన్‌’ సినిమాను మోజ్విత్‌ అండ్‌ చరణ్‌ తేజ్‌ సమర్పణలో యాంట్స్‌ టు ఎలిఫెంట్స్‌ సినిమాస్‌ కో ప్రొడక్షన్‌ బ్యానర్‌పై అనిల్‌ రెడ్డి తెలుగులో ‘హలో జూన్‌’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.ఈ సినిమాకు అహ్మద్‌ కబీర్‌ దర్శకత్వం వహించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ జూన్ సారా జాయ్ అనే అమ్మాయి స్కూల్ రోజులతో మొదలవుతుంది. పదో తరగతి చదువుతున్న జూన్, తన స్నేహితులతో సరదాగా గడిపే ఒక సాధారణ అమ్మాయి. ఆ సమయంలో తన క్లాస్‌మేట్ నోయెల్‌తో ఆమె మొదటి సారిగా ప్రేమలో పడుతుంది. తన తండ్రితో (జోజు జార్జ్) ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఇక స్నేహితులతో చేసే అల్లరి సరదాగా ఉంటుంది. ఇవి చిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. టీనేజ్ వయస్సులో వచ్చే మార్పులను దర్శకుడు చాలా సహజంగా చూపించారు. అయితే పైచదువుల కోసం నోయెల్ విదేశాలకు వెళ్లడంతో స్టోరీ మలుపు తీసుకుంటుంది. వాళ్ళ ప్రేమకు బ్రేక్ పడటంతో జూన్ మొదటిసారి ఎమోషనల్ గా కుంగిపోతుంది.

ఆ తరువాత ఆమె చదువు పూర్తి చేసి ముంబైలో ఉద్యోగంలో చేరుతుంది. ఆమె తన పాత జ్ఞాపకాల నుండి బయటపడి బ్రతకడం నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఆమె జీవితంలోకి ఆనంద్ అనే వ్యక్తి వస్తాడు. గతంలో జరిగిన బ్రేకప్ నుండి పాఠాలు నేర్చుకున్న జూన్, చివరకు తన వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తిని ఎలా ఎంచుకుందనేదే ఈ సినిమా ముగింపు. ఇది ఒక అమ్మాయి పదేళ్ల ప్రయాణాన్ని అద్భుతంగా చూపించే ఒక కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా.

Advertisement

Read Also : ‘పింక్’ నుండి ‘థప్పడ్’ వరకు… ‘అస్సీ’ విడుదలకు ముందు చూడాల్సిన తాప్సీ పన్ను అద్భుతమైన సినిమాలు ఇవే

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×