E-Paper
Advertisement

మీ ముందు నవ్వుతూ వెన్నుపోటు పొడిచే స్నేహితులు వీరే.. నమ్మకద్రోహులను ఇలా గుర్తించండి

మీ ముందు నవ్వుతూ వెన్నుపోటు పొడిచే స్నేహితులు వీరే.. నమ్మకద్రోహులను ఇలా గుర్తించండి
Advertisement

ఆచార్య చాణక్య మానవ స్వభావం గురించి లోతైన జ్ఞానాన్ని వేల సంవత్సరాల క్రితం బోధించాడు. చాణక్య నీతిలో ముఖ్యమైన పాఠాల్లో నమ్మకద్రోహులను గుర్తించే అంశం ఒకటి. చాణక్య నీతి.. మనకు స్వార్థం కోసం స్నేహం చేసేవారి గురించి, పాము లాంటి విషతుల్యమైన వ్యక్తులను గుర్తించడం ఎలాగో నేర్పుతుంది. ఇలాంటి వ్యక్తులు తీయని మాటలు, నటనతో మనల్ని మోసం చేస్తారు. అందుకే చాణక్యుడు స్నేహితులను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

మీ ముందు తీయని మాటలు చెబుతూ మోసం చేసే నకిలీ స్నేహితులు

నకిలీ స్నేహితులు ముఖం మీద చాలా మర్యాదగా, ప్రేమగా మాట్లాడతారు. కానీ మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడతారు. వారి మాటలు తీయగా ఉంటాయి.. కానీ ఉద్దేశ్యాలు స్వార్థపరంగా ఉంటాయి. చాణక్యుడు ఇలాంటి వ్యక్తులు మన జీవితానికి ప్రమాదకరమని హెచ్చరించాడు. వారి తీపి మాటల వెనుక స్వార్థం దాగి ఉంటుంది.

కష్టాల సమయంలోనే వ్యక్తి నిజ స్వభావం తెలుస్తుంది

Advertisement

జీవితంలో కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు నిజమైన స్నేహితులు మన పక్కన నిలబడతారు. కానీ నకిలీ స్నేహితులు అప్పుడు దూరంగా పారిపోతారు. జీవితంలో అంతా సుఖంగా ఉన్న సమయంలో అందరూ స్నేహితులే, కానీ కష్ట సమయంలో ఎవరు నిలబడతారో వారిదే నిజమైన స్నేహం. కష్టాలు.. స్నేహితుల నిజాయితీకి పరీక్ష అని చాణక్యుడు చెప్పాడు.

తమ స్వార్థం కోసం మనల్ని ఉపయోగించుకునే స్నేహితులు

కొందరు వ్యక్తులు తమ అవసరాలు తీర్చుకునేంతవరకు మన పక్కన ఉంటారు. అవసరం తీరగానే మెల్లగా దూరమవుతారు. ఇలాంటి వారి వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. కానీ మన వనరులు, శక్తిని, సమయాన్ని హరించేస్తారు. చాణక్యుడు ఇలాంటి సంబంధాలు స్వార్థపూరితమైనవని స్పష్టం చేశాడు. ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉండటం మంచిదని సూచించాడు.

ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడుతూ నిరాశ కలిగించేవారు

Advertisement

కొందరు వ్యక్తులు ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతుంటారు. మన లక్ష్యాలను తక్కువ చేసి, ప్రయత్నాలను విమర్శిస్తారు. వారి మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. వీరితో ఎక్కువ సమయం గడపడం మన మానసిక శాంతిని నాశనం చేస్తుంది. చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉండాలని సలహా ఇచ్చాడు.

ఇతరుల గురించి గాసిప్ చేసే వారిని నమ్మకూడదు

ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు మన గురించి కూడా అదే చేస్తారు. వారు రహస్యాలు బయటపెట్టి, అసత్యాలు ప్రచారం చేస్తారు. చాణక్యుడు ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పాడు. వారితో వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు.

Also Read: మీ పిల్లలను ప్రయోజకులుగా, కాన్ఫిడెంట్‌గా చేయాలనుకుంటున్నారా? రాత్రి నిద్రపోయే ముందు ఈ విషయాలు నేర్పండి

మాటల కంటే చర్యలను గమనించండి

చాణక్యుడు మంచి మాటలు కాకుండా చర్యలను బట్టి వ్యక్తులను అంచనా వేయాలని సలహా ఇచ్చాడు. నిజమైన స్నేహితులు కష్ట సమయంలో సహాయం చేసి చూపిస్తారు. నకిలీ స్నేహితులు మాటల్లో మాత్రమే మంచిగా ఉంటారు. కాలం గడిచేకొద్దీ నిజాయితీ గలవారు ఎవరో తెలుస్తుంది.

Related News

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

Big Stories

Advertisement
×