E-Paper
Advertisement

మీ పిల్లలను ప్రయోజకులుగా, కాన్ఫిడెంట్‌గా చేయాలనుకుంటున్నారా? రాత్రి నిద్రపోయే ముందు ఈ విషయాలు నేర్పండి

మీ పిల్లలను ప్రయోజకులుగా, కాన్ఫిడెంట్‌గా చేయాలనుకుంటున్నారా? రాత్రి నిద్రపోయే ముందు ఈ విషయాలు నేర్పండి
Advertisement

ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పిల్లలతో మాట్లాడటం వారిపై మానసిక ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మంచి మాటలు పిల్లలలో ఆత్మవిశ్వాసం, భద్రతా భావం పెంచుతాయి. రోజంతా పేరుకున్న ఒత్తిడి, భయం, సందేహాలను తగ్గించి మంచి నిద్ర ఇస్తాయి.

మీరెంతగా పిల్లల్ని ప్రేమిస్తున్నారో చెప్పండి

ప్రతిరోజూ తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. వారితో సమయం గడపండి. మీరెంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు, భద్రతగా, సంతోషంగా ఉంటారు. ఇది వారి మనసులో భద్రతా భావాన్ని పెంచుతుంది.

మీ పిల్లాడు గర్వకారణం అని చెప్పండి

Advertisement

పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వినాలని కోరుకుంటారు. అందుకే తల్లిదండ్రులు.. పిల్లలు ఏదైనా మంచి పని చేసినా, ఏదైనా సాధించినా వారి ప్రయత్నాలను మెచ్చుకోండి. వారి ప్రయత్నాలు చూసి గర్వం కలిగిందని తల్లిదండ్రులు చెప్పాలి. చిన్న విజయాలను కూడా ప్రశంసించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

తప్పులు సహజమే అని గుర్తు చేయండి

పిల్లలు తప్పు చేస్తే భయపడతారు. అందుకే ఆ సమయంలో వారితో తప్పులు చేయడం సాధారణ విషయమని.. తప్పులు ఒప్పొకొని వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని బోధించండి. ఇలా చెప్పడం వల్ల పిల్లల్లో భయం తగ్గి, ధైర్యం పెరుగుతుంది.

ధైర్యంగా ఉండాలని ప్రోత్సహించండి

Advertisement

సమస్యలు వస్తే ధైర్యంగా ఉండాలని పిల్లలకు నేర్పాలి. పాఠశాలలో, స్నేహితులతో ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పండి.

రోజూ చేసే పనుల గురించి అడగండి

పిల్లలు రోజంతా చేసిన పనులు గురించి అడిగి తెలుసుకోండి. ఆ రోజులో చేసిన పనులలో ఏ విషయం నచ్చింది? వారి అనుభవం గురించి మాట్లాడటం వల్ల పిల్లలు సంతోషంగా, కృతజ్ఞతతో నిద్రపోతారు.

ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమనండి

పిల్లలు కొన్నిసార్లు బాధ, భయం దాచుకుంటారు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలని, వారికి అండగా మీరు ఉన్నారని ధైర్యం చెప్పండి. ఇలా వినడం వల్ల పిల్లలు మానసికంగా బలపడతారు.

నువ్వు స్పెషల్ అని చెప్పండి

మీ పిల్లాడు చాలా స్పెషల్ అని భావన కలిగించాలి. పిల్లాడిలో ఉన్న మంచి గుణాలు వివరిస్తూ ప్రశంసించండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

మంచితనం, కృతజ్ఞత నేర్పండి

పిల్లల్లో ఇతరులకు సహాయపడాలని దయా గుణం గురించి నేర్పించండి. అలాగే ఎవరైనా సాయం చేస్తే వారికి కృతజ్ఞత తెలియజేయాలని నేర్పించండి. ఇలాంటి అలవాట్లు మీ పిల్లల్లో వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది.

Also Read: రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారా.. నిద్ర రావడం లేదా? దానికి కారణాలు ఇవే

ప్రశాంతమైన రాత్రి రొటీన్

కథ చెప్పడం, ప్రార్థన చేయడం, మంచి మాటలు చెప్పడం వంటి అలవాట్లు పిల్లలకు మంచి నిద్ర ఇస్తాయి. రోజూ ఇలాంటి రొటీన్ ఉంటే పిల్లలు భద్రతగా భావిస్తారు.

రాత్రి చెప్పే మంచి మాటలు పిల్లల మనసులో లోతుగా నిలిచిపోతాయి. ఇవి ఆత్మవిశ్వాసం, మానసిక బలం పెంచి, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలపరుస్తాయి. ప్రతి రాత్రి కొద్దిసేపు సానుకూలంగా మాట్లాడటం పిల్లల భవిష్యత్తుకు చాలా మంచిది.

Related News

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

Big Stories

Advertisement
×