E-Paper
Advertisement

భార్యాభర్తల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

భార్యాభర్తల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
Advertisement

Marriage Advice:భార్యంటే భర్తలో సగం అంటారు.కానీ ప్రస్తుతమున్న బిజీ లైఫ్ లో, ఆఫీస్ ప్రెజర్ లో సోషల్ మీడియా రీల్స్ పిచ్చిలో పడి సగ భాగమైన భార్యని అసలు పట్టించుకోవడం అటుంచి పలకరించడమే మానేశారు.ఇలాంటి పరిస్థితుల్లో మీ కాపురాలు కలకాలం పచ్చగా నిలవాలంటే వేల ఏళ్ల క్రితమే చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గమనించుకోవాల్సిందే!

భార్యాభర్తల మధ్య మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోతుందా..

Advertisement

భార్యా భర్తల మధ్య మాట్లాడుకోవడం అనేది అన్నింటికన్నా ముఖ్యం. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోతుందో,అక్కడ అపార్థాలు మొదలవుతాయ్.మొదటగా చిన్న చిన్న విషయాలు దాచడం మొదలుపెట్టి, అది కాస్తా పెద్ద అబద్ధాలకు దారితీస్తుంది. చివరకు ఒకే ఇంట్లో ఉంటూనే ఇద్దరు అనౌన్ పర్సన్స్ గా మిగిలిపోతారు.మీ మధ్య మాటలు తగ్గి, కేవలం అవసరానికే మాట్లాడుకుంటున్నారంటే.. మీ బంధం బలహీనపడుతోందన్న విషయం గుర్తుంచుకోండి.

పెద్ద పెద్ద వాదనలు జరుగుతున్నాయా?

Advertisement

గతంలో సరదాగా నవ్వుకుని వదిలేసిన విషయాలకే ఇప్పుడు పెద్ద పెద్ద వాదనలు జరుగుతున్నాయా? కారణం లేకుండానే ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారా?అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. మీ మధ్య ప్రేమ స్థానంలో ‘అసహనం’ వచ్చి చేరిందని అర్థం ,సహనం లేని చోట ప్రేమకు ప్లేసుండదు. కోపం పెరిగే కొద్దీ బంధంలో రెస్పెక్ట్ మాయం అవుతుంది.ఇక ఒకరిపై మరొకరికి గౌరవం లేని చోట భార్యా భార్యలుగా ఎంతకాలం ఉన్నా అది నరకప్రాయమే.

ఒక వైపు  ఆఫీస్ లో ప్రెజర్ , మరోవైపు  చేతిలో స్మార్ట్‌ఫోన్

also read:‘డ్రగ్’ వార్‌…..టాలీవుడ్ vs పొలిటీషియన్స్

ఇక వీటికి తోడు ఈ డిజిటల్ యుగంలో ఒక వైపు  ఆఫీస్ లో ప్రెజర్ , మరోవైపు  చేతిలో స్మార్ట్‌ఫోన్ .. కట్ చేస్తే కట్టుకున్న పార్టనర్ తో కలిసి స్పెండ్ చేసే టైం సున్నా.సో లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే, ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవడానికి రోజులో కొంచెం టైం కేటాయించండి. అలా జరగకపోతే మాత్రం ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్ కనెక్ట్ అవడం పక్కా .ఇక ఈ గ్యాప్ లో మూడో వ్యక్తీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.సో మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తికి ఏ మాత్రం ప్లేసు ఇవ్వకండి.

నమ్మకం అనేది చాలా ముఖ్యం

ఇక ఇద్దరు భార్యా భర్తల మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఇద్దరి మధ్య ట్రాన్స్ఫరెన్సి లేకపోవడం, పోన్ లాక్ తెలీకుండా మార్చేయడం, అడిగితె అబద్దాలు చెప్పడం, ఎక్కువగా సీక్రెసీ మెయింటేన్ చేయడం వంటివి బంధాన్ని బీటలు వార్చేవే,ఒక్కసారి గనుక నమ్మకం పోయిందా మళ్ళీ రావడం చాలా కష్టం .

సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోకుండా

చాణక్యుడి సూచన ప్రకారం.. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోకుండా , దానిపై కూర్చుని మాట్లాడండి.ముఖ్యంగా ఎదుటి వారు కోపంలో ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండటం నేర్చుకోండి.ఇక ఇతరుల ముందు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా భాగస్వామిని తక్కువ చేసి అస్సలు మాట్లాడకండి.

ఇలాంటి చిన్న చిన్న మార్పులే

అన్నింటికన్నా మించి ట్రాన్స్ఫరెన్సి అనేది ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుతుంది.ఇలాంటి చిన్న చిన్న మార్పులే జీవితాలల్లో పెద్ద సంతోషాలని నింపుతాయి. సో మీ బంధం పదికాలాల పాటు పచ్చగా ఉండాలంటే..ఇగోలని పక్కన పెట్టి కలిసి కష్ట సుఖాలని పంచుకుంటేనే జీవితం సుఖమయం అవుతుంది.

also read:ఏసీ కొంటున్నారా? ఆఫర్లు చూసి మోసపోకండి..

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×