Drug Debate :సినిమాలకి, రాజకీయాలకి విడదీయలేని సంబంధం ఉందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.తాజాగా డ్రగ్స్ ఇష్యూతో మరోసారి ఈ రెండు రంగాలు మరోసారి ఒక్కటిగా వార్తల్లోకి ఎక్కాయి. గతంలో ఒకసారి టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా డ్రగ్స్ కేసులో విచారణ ఫేస్ చేశారు కూడా. అయితే మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ మంటల్ని రాజేశాడు జడ్చర్ల mla అనిరుద్ రెడ్డి.పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో ఒక్కసారిగా హైలెట్ అయిన డ్రగ్స్ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి చివరకి టాలీవుడ్ వైపుకి తిరిగింది.సొసైటీలో అందరికి ఆదర్శంగా ఉండే హీరోలంతా ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, వచ్చిన రిపోర్ట్స్ ని సోషల్ మీడియాలో పెట్టాలని సూటిగా టార్గెట్ చేయడం ఇపుడు టాలీవుడ్ లో మంటలు పెడుతుంది.
ఒక్క టాలీవుడ్ మాత్రమే ఎందుకు ?
అంటే స్టార్స్ ని చూసి ఆడియన్స్ & పబ్లిక్ ఇన్ ఫ్లూయెన్స్ అవుతారు కాబట్టి, వాళ్లే ముందుండి టెస్టులు చేయించుకోవాలి” అని ఆయన ఆర్గ్యుమెంట్.అంతే కాదండోయ్ …యూరిన్ టెస్ట్ అయితే 14 రోజుల్లో మాయమైపోతుందని, ఏకంగా ఫాలికల్ (జుట్టు) టెస్ట్ చేయించుకోవాలని కండిషన్ పెట్టారు.పై పెచ్చు ఇండస్ట్రీ లోనే డ్రగ్స్ కల్చర్ బాగా ఉందని , ఇది నేను కాదు పబ్లిక్ అనుకుంటున్న మాట అంటూ చల్లగా సైడ్ అయ్యే ప్లాన్ చేశాడు కూడా.నిజానికి ఈ డిమాండ్ బాగుంది కూడా .కానీ డిస్కషన్ అంతా ఒక్క టాలీవుడ్ మాత్రమే ఎందుకని.ఇదే విషయాన్ని రైజ్ చేశారు తమ్మారెడ్డి. ఇక రాహుల్ రామ కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి మేము చేయించుకుంటాం ..అలాగే మీరూ వారానికి ఒకసారి లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలి అంటూ కౌంటర్ వేశాడు కూడా.ఇక మంచు విష్ణు మాట్లాడుతూ “సినిమా వాళ్లు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. ఏదైనా జరిగితే వెంటనే ఇండస్ట్రీ వైపు వేలెత్తి చూపడం అలవాటైపోయింది. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలనే కండీషన్ పెడితే అది కేవలం నటులకే ఎందుకు? రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఇలా సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అందరికీ వర్తింపజేయాలి” అని కౌంటర్ ఇచ్చారు.చూస్తుంటే ముందు ముందు రోజుల్లో మరింత మంది స్టార్ సెలెబ్రెటీస్ తమ వాయిస్ గట్టిగా రైజ్ చేసేలానే ఉన్నారు.ఇక మరో వైపు ఇక ఇదే విషయంపై తెగ ఫైర్ అయిపోతున్నారు ఫ్యాన్స్.
మాట్లాడితే బయట డ్రగ్స్ తీసుకుంటున్నట్టా?
also read:హరీష్ శంకర్ పనైపోయినట్టేనా.. టైర్-2 హీరోలు కూడా ?
అనిరుధ్ రెడ్డి తన స్పీచ్ లో చెప్పినట్టుగా బాలకృష్ణ ‘మామా ఏక్ పెగ్ లా’ అంటూ పాట పాడినా, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’లో గుడుంబా తాగే సీన్ల గురించి ప్రస్తావించినా అది కేవలం సినిమా వరకు మాత్రమే పరిమితం చేయాలని,సినిమాల్లో వాటి గురించి మాట్లాడితే బయట డ్రగ్స్ తీసుకుంటున్నట్టా?” అంటూ నెట్టింట కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.ఇక ఇక్కడే ఆగేలా లేదంటూ ఈ ఇష్యూ యూట్యూబ్ ఛానెళ్లలో,టీవీ డిబేట్‌లలో ప్రైమ్ టాపిక్ అయిపొయింది. అనిరుద్ రెడ్డి చెప్పిన మాటలు బాగున్నాయని, సినిమా స్టార్స్ మాత్రమే కాకుండా ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ బయట పెట్టాలని, ఎన్నికల్లో దిగే ముందు క్యాండేట్స్ అందరికి డ్రగ్ టెస్ట్ తప్పనిసరి చేయాలని,ఒక వేళ రిపోర్ట్ గనుక పాజిటివ్ వస్తే వాళ్లను అనర్హులుగా ప్రకటించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది.
ఆ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే..
అయితే రెండు వర్గాల వారు కోరుకున్నట్టుగా కేవలం ఒక సెలబ్రిటీ రిపోర్టును బయట పెట్టినంత మాత్రానా సొసైటీలో డ్రగ్స్ కన్జ్యూం ఆగిపోతుందా అంటే అనుమానమే. విచ్చల విడిగా గంజాయ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే,ప్రతీ గల్లిల్లో డ్రగ్స్ ని పిప్పరమెంట్లు లాగా అమ్ముతుంటే ఈ మహమ్మారి సడన్ గా మాయమైపోవాలని కోరుకోవడం అత్యాశే. ముఖ్యంగా ఎవరికీ వారు ఈ డ్రగ్స్ వల్ల ఎంత నష్టాలపాలు అవుతామో స్వతహాగా తెలుసుకొని వారికి వారుగా మానేసే ప్రయత్నం చేసినప్పుడే ఏమైనా ఫలితం ఉంటుంది.సో ఇప్పటికైనా మూలాల లోతులకి వెళ్ళకుండా కేవలం కొందరిని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ని మట్టుబెట్టాలనుకుంటే మాత్రం ఆ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే. ఇకనైనా ‘సే నో టు డ్రగ్స్’అంటూ కొటేషన్స్ ని కేవలం ప్లకార్డులకి పరిమితం చేయకుండా సీరియస్ గా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపితే కొంతలో కొంతైనా మార్పు కనిపిస్తుంది .
also read:భార్యాభర్తలు ఈ విషయాలు దాచారో.. మీ కాపురం కొంపకొల్లేరే!