E-Paper
Advertisement

Protein Food: చికెన్,పనీర్, గుడ్డు.. ప్రొటీన్ కోసం ఏది తినాలి?

Protein Food: చికెన్,పనీర్, గుడ్డు.. ప్రొటీన్ కోసం ఏది తినాలి?
Advertisement

బరువు తగ్గాలన్నా, కండలు పెంచుకోవాలన్నా, రోజూ ఎనర్జీగా ఉండాలన్నా మన ఆహారంలో ప్రోటీన్ చాలా ముఖ్యం. అందుకే ఎక్కువ మంది గుడ్లు, పనీర్, చికెన్ వంటి ప్రోటీనున్న పదార్థాలను మన రోజువారీ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. కానీ వీటిలో ఏది మంచి ప్రోటీన్ ఇస్తుంది? ఏది త్వరగా జీర్ణమవుతుంది? ఏది శరీరానికి మంచిది? అనే విషయం చాలా మందికి క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే మూడు ఆహారాల్లోనూ మంచి ప్రోటీన్ ఉంటుంది. కానీ ఒక్కో దాంట్లో ఉండే పోషకాలు మాత్రం కొంచెం తేడాగా ఉంటాయి.

పనీర్ తింటే
మొదట పనీర్ గురించి మాట్లాడితే, ఇది శాకాహారులకు వరం లాంటిదే. నేరుగా పాల నుంచి తయారయ్యే కాబట్టి దీనిలో సహజంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100గ్రా పనీర్‌లో సుమారు 18గ్రా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు కూడా ఉంటుంది. అది శరీరానికి శక్తినిస్తుంది. అదనంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఎముకలకు బలంగా ఉంటుంది. కానీ పనీర్ మాత్రం జీర్ణం కావడానికి కొంచెం టైమ్ పడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు తక్కువ ఫ్యాట్ ఉన్న పనీర్‌ తీసుకోవడం మంచిది. జిమ్‌కు వెళ్లేవాళ్లు అయితే పనీర్‌ను ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఇది నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్లు తీసుకుంటే కూడా బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి శాకాహారులకు పనీర్ మంచి ఆహారమనే చెప్పుకోవాలి.

Advertisement

కోడిగుడ్డు గురించి
గుడ్డులోని ప్రోటీన్‌ను మన శరీరం చాలా ఈజీగా గ్రహిస్తుంది. అందుకే గుడ్లను పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫుడ్ అంటారు. ఒక గుడ్డులో దాదాపు 6గ్రా ప్రోటీన్ ఉంటుంది. పచ్చసొనలో మంచి ఫ్యాట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. తెల్లసొన అయితే పూర్తిగా ప్రోటిన్ తో నిండి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు తెల్లసొన మాత్రమే తింటే బాగుంటుంది. గుడ్లు మెదడు, కండరాలు, కళ్లకు బాగా ఉపయోగపడతాయి. ఉదయాన్నే ఒక రెండు గుడ్లు తింటే చాలా సేపు ఆకలి వేయదు. ఫిజికల్ వర్క్ చేసే వాళ్లు గుడ్లు రెగ్యులర్‌గా తినడం చాలా మంచిది. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన అమినో ఆసిడ్లు కూడా ఇందులోనే ఉంటాయి. జీర్ణం కూడా చాలా ఈజీగా అవుతుంది. అందుకే గుడ్లు ఎక్కువ మందికి బెస్ట్ ఆప్షన్.

ఇక చికెన్ విషయానికి వస్తే
చికెన్ నాన్‌-వెజ్ తీసుకునే వాళ్లకు ప్రధాన ప్రోటీన్ సోర్స్ గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉడికించిన చికెన్ లేదా గ్రిల్ చేసిన చికెన్ ఎంతో మంచిది. 100గ్రా చికెన్‌లో దాదాపు 27గ్రా ప్రోటీన్ ఉంటుంది. అంటే గుడ్లు, పనీర్ కన్నా ఇది ఎక్కువ. అందుకే జిమ్ చేసే వాళ్లు చికెన్‌ను బాగా తినేందుకు ఇష్టపడతారు. కండరాలు పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చికెన్‌లో ఐరన్, జింక్, బి6 వంటి విటమిన్లు ఉంటాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఫ్రై చేసిన చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ మసాలాతో చేసిన చికెన్ కూడా అంతగా మంచిది కాదు. ఆరోగ్యం కావాలంటే ఉడికించిన, తక్కువ నూనెతో చేసిన చికెన్ ఉండాలి. అలా తింటే శరీరానికి శక్తి, బలం బాగా వస్తుంది.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×