E-Paper
Advertisement

Ravi Teja : మాస్ మహారాజా కోసం తమిళ్ పొన్ను , కనీసం ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందా?

Ravi Teja : మాస్ మహారాజా కోసం తమిళ్ పొన్ను , కనీసం ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందా?
Advertisement

Ravi Teja-Priya Bhavani Shankar: మాస్‌ మహారాజా రవితేజకు ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. ఆయన సినిమాలన్ని వరుసగా బాక్సాఫీసు వద్ద బొల్తా కొడుతున్నాయి. అయినా ఈ మాస్‌మహారాజా తగ్గేదే లే అంటున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. సినిమా డిజాస్టర్‌ అయినా ఆ వెంటనే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. కనీసం గ్యాప్‌ కూడా ఇవ్వడం లేదు తీసుకోవడం లేదు. ధమాకా తప్పా ఆయన నుంచి వచ్చిన సినిమాలన్ని డిజాస్టరే.

మాస్ జాతర డిజాస్టర్

గతేడాది హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మిస్టర్‌ బచ్చన్‌ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఈ ఏడాది మాస్‌ జాతరతో వచ్చాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహించారు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. కనీస వసూళ్లు కూడా రాలేదు. అయితే ఈ సినిమా డిజాస్టర్‌పై కుంగిపోకుండ ఆ వెంటనే ప్రముఖ డైరెక్టర్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆయనే శివ నిర్వాణ. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రానున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరో ప్లాప్ డైరెక్టర్ సిగ్నల్

Advertisement

ఇప్పటికే వీరిద్దరి చివరిగా ఆయన సమంత-విజయ్‌ దేవరకొండలతో ఖుషి చేశాడు. ఈ సినిమా ఫలితం ఏమైందో మీకు తెలిసిందే. ఇటూ శివ నిర్వాణకు కూడా హిట్‌ పడి చాలాకాలం అవుతుంది. ఆయనతో స్టార్‌ హీరోలు కూడా సినిమా చేసేందుకు ధైర్యం చేయడం లేదు. ఈ క్రమంలో రవితేజ ఆయనకు ఒకే చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనుందని సినీ సర్కిల్లో టాక్‌. ఇందులో తమిళ్‌ బ్యూటీ ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భామ లక్క్‌తో అయిన మన మాస్‌ మాహారాజకు ఈసారైనా హిట్‌ పడుతుందని ఆశలో ఉన్నారు.

Also Read: Varanasi Movie: ‘వారణాసి’లో మహేష్‌ మేనల్లుడు… అటు ప్రభాస్… ఇటు మామయ్య

తమిళ బ్యూటీ హీరోయిన్

Advertisement

అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మాస్‌ మహారాజ హీరోగా ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలోయాక్షన్‌ థ్రిల్లర్‌గా ఓ చిత్రం ఫిక్స్‌ అయ్యిందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పనులు కూడా చకచక జరుగుతున్నట్టు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌. ప్రస్తుతం శివ నిర్వాణ స్క్రిప్ట్‌ రాస్తున్నట్టు తెలుస్తోంది. అంతా ఒకే అయ్యి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాక సినిమాపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా హిట్ అనేది ఇప్పుడు రవితేజ, శివ నిర్వాణకు చాలా ముఖ్యం. గత కొంతకాలంగా వీరిద్దరికి హిట్స్ లేవు. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఓ వైపు ప్లాప్స్ చూస్తున్న రవితేజ.. శివ నిర్వానను నమ్మి సినిమా చేయడమంటే సాహసమనే చెప్పాలి. మరి ఈ కాంబో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×