E-Paper
Advertisement

Summer Tips: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

Summer Tips: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
Advertisement

Summer Tips: సాధారణంగా సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే.. కొంతమందికి ఎంత నీళ్లు తాగినా మళ్లీ మళ్లీ దాహంతో గొంతు ఎండిపోతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో చాలామంది కొబ్బరి నీళ్లు లేదంటే చెరకు రసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మన శరీరాన్ని ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది? ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? అన్న సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా ఎండలు మండిపోయే ఈ రోజుల్లో మన శరీరానికి కేవలం నీరు మాత్రమే సరిపోదు.. కోల్పోయిన ఖనిజ లవణాలను తిరిగి పొందే పానీయం అవసరం.
ఈ క్రమంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే.. కొబ్బరి నీళ్లు తాగాలా లేక చెరకు రసం తాగితే మంచిదా.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేషన్‌కు ఏది బెస్ట్?

నిజానికి హైడ్రేషన్ అనగానే మనకు మొదటగా గుర్తుకు రావాల్సింది కొబ్బరి నీళ్లు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు సహజ సిద్ధంగా పుష్కలంగా ఉంటాయి. మనం ఎండలో తిరిగినప్పుడు చెమట రూపంలో ఈ లవణాలను

Advertisement

Also Read: బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ ప్రొజెక్టర్.. కరెంట్ లేని చోట కూడా సినిమాలు చూసేయొచ్చు!

చెరకు రసంతో ఇన్‌స్టంట్ ఎనర్జీ..

మరోవైపు చెరకు రసం విషయానికి వస్తే.. ఇది తక్షణ శక్తికి మారుపేరు. ఎండ వల్ల బాగా అలసిపోయి నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చెరకు రసం తాగితే వెంటనే ఉత్సాహం వస్తుంది. దీనికి కారణం అందులో ఉండే సహజమైన చక్కెరలే. అయితే హైడ్రేషన్ విషయంలో ఇది కొబ్బరి నీళ్లంత ప్రభావవంతంగా ఉండదు. ఎందుకంటే.. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి కేవలం శక్తిని మాత్రమే ఇస్తుంది కానీ ఎక్కువ సేపు డీహైడ్రేషన్ నుండి కాపాడలేదు.

ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?

Advertisement

కొబ్బరి నీళ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి బాగా హెల్ప్ అవుతాయి. కానీ చెరకు రసంలో క్యాలరీలు కొంచెం ఎక్కువే. అయితే ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మన శరీరానికి అదనపు బలాన్ని ఇస్తాయి. ఎనీమియా వంటి సమస్యలతో బాధపడేవారికి చెరకు రసం కొంతవరకు మేలు చేస్తుంది.

ఎప్పుడు ఏది తీసుకోవాలంటే?

ఒకవేళ మీరు ఎండలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నా లేదంటే వ్యాయామం చేసిన తర్వాత అలసిపోయినా కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లబరుస్తుంది. ఇక బాగా ఆకలిగా ఉండి వెంటనే శక్తి కావాలనిపిస్తే చెరకు రసాన్ని తీసుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగడమే ఆరోగ్యం. కానీ అప్పుడప్పుడు రుచి కోసం చెరకు రసాన్ని కూడా ఆస్వాదించడంలో తప్పు లేదు.

Also Read: జేబులో పట్టేంత JBL మినీ స్పీకర్.. అది కూడా స్మార్ట్ AI ఫీచర్లతో, ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×