E-Paper
Advertisement

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ వేట.. రూ. 25 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ వేట.. రూ. 25 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!
Advertisement

Hyderabad: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీ డ్రగ్స్ రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు. విదేశాల నుండి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. పక్కా సమాచారంతో నిఘా ఉంచిన అధికారులు, బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వీరి వద్ద నుంచి దాదాపు 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. సాధారణ గంజాయితో పోలిస్తే ఈ ‘హైడ్రోపోనిక్’ రకం చాలా ఖరీదైనది , శక్తివంతమైనది. ఈ రకమైన హైడ్రోపోనిక్ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. నిందితులు దీనిని ప్యాకెట్లలో గుట్టుచప్పుడు కాకుండా బ్యాగుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

Advertisement

ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అధికారులు వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఉన్న ముఠా ఎక్కడ ఉంది? హైదరాబాద్‌లో ఈ డ్రగ్స్‌ను ఎవరికి సరఫరా చేయాలనుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా డ్రగ్స్ సరఫరా పెరుగుతుండటంతో ఎయిర్‌పోర్ట్ వద్ద తనిఖీలను మరింత కఠినతరం చేశారు. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే క్రమంలో ఈ పట్టివేత ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు.

Also Read: చల్లపల్లిలో భారీ పేలుడు.. స్పాట్‌లో నలుగురు పోలీసులు

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×