E-Paper
Advertisement

Cod Liver Oil: హార్ట్ ఎటాక్‌ను అడ్డుకునే కాడ్ లివర్ ఆయిల్.. తరచూ తీసుకుంటే దిమ్మతిరిగే ప్రయోజనాలు!

Cod Liver Oil: హార్ట్ ఎటాక్‌ను అడ్డుకునే కాడ్ లివర్ ఆయిల్.. తరచూ తీసుకుంటే దిమ్మతిరిగే ప్రయోజనాలు!
Advertisement

Cod Liver Oil: సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవ్వాలంటే కొన్నిరకాల సముద్రపు చేపలను తినమని సలహా ఇస్తుంటారు వైద్యులు. మన రోజూవారీ డైట్‌లో సముద్రపు చేపలను చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపోతే సముద్రం దిగువన నివసించే కాడ్ చేపల లివర్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. దీనిని వంట‌ల్లో ఉప‌యోగించ‌రు. స‌ప్లిమెంట్‌గా మాత్రమే తీసుకుంటారు. అంటే.. పోష‌క ప‌దార్థంగా ఈ ఆయిల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనినే కాడ్ లివ‌ర్ ఆయిల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది పోష‌కాల‌తో కూడిన ఒక ర‌క‌మైన నూనె. కాడ్ ఫిష్ జాతికి చెందిన లివ‌ర్ నుంచి ఈ ఆయిల్‌ను సేకరిస్తారు. ఈ ఫిష్ ఆయిల్‌ స‌ప్లిమెంట్ల‌ను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లని వాడమని డాక్టర్లు సూచిస్తుంటారు.

ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు:

కాడ్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ సప్లిమెంట్స్‌ ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అధిక మొత్తంలో విట‌మిన్ ఎ, డి కూడా లభిస్తాయి. ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శ‌రీరంలోని వాపుల‌ను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి కాడ్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

Advertisement

Read Also: చిన్న తీపి ముక్క చాలు.. చలికాలంలో వేధించే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

గుండెపోటుకు అడ్డుకట్ట:

గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ కాడ్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తరచూ తీసుకుంటే.. హార్ట్స్ ఎటాక్స్ దాడి నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాడ్ ఫిష్ ఆయిల్
గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. కాడ్ లివ‌ర్ ఆయిల్ లేదా ఫిష్ ఆయిల్ స‌ప్లిమెంట్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు సైతం త‌గ్గిపోతాయంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా గుండె కండ‌రాలు, ర‌క్తనాళాల వాపులు ఇట్టే తగ్గిపోతాయి.

ఎముక‌లు దృఢంగా:

Advertisement

కాడ్ లివ‌ర్ ఆయిల్‌ వల్ల ఎముక‌లు దృఢంగా మారడమే కాకుండా.. ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. ఈ ఆయిల్‌లో ఉండే విట‌మిన్ డి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే విట‌మిన్ డి వ‌ల్ల శ‌రీరరోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. వ‌య‌సు పైబడటం వ‌ల్ల వ‌చ్చే ఆస్టియో పోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. కాడ్ లివ‌ర్ ఆయిల్‌లో ఉండే విట‌మిన్ ఎ.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాడ్ లివర్ ఆయిల్ తీసుకుంటే.. చ‌ర్మం ఆరోగ్యంగా, పొడిబార‌కుండా చూసుకోవ‌చ్చు.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్:

ఈ సముద్రపు చేప లివ‌ర్ ఆయిల్‌ను తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండటమే కాకుండా.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. అలాగే గుండెపోటు నివారించ‌డానికి కాడ్ లివర్ ఆయిల్ సహాయపడుతుంది. ఈ ఆయిల్‌లో ఉండే విట‌మిన్ డి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల ఆస్త‌మా, బ్రాంకైటిస్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి శీతాకాలంలో ఎంతో మేలు జ‌రుగుతుంది.

Read Also: సూపర్ ఫ్రూట్.. క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకూ అన్నీ మటుమాయం!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×