E-Paper
Advertisement

Mahesh Babu: వారణాసి కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్.. ప్రాచీన యుద్ధకళ ‘కలరిపయట్టు’తో సూపర్ బెనిఫిట్స్!

Mahesh Babu: వారణాసి కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్.. ప్రాచీన యుద్ధకళ ‘కలరిపయట్టు’తో సూపర్ బెనిఫిట్స్!
Advertisement

Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’ విడుదల కోసం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయకుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్‌ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసింది. వారణాసి చిత్రం కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు నేర్చుకుంటున్నారు హీరో మహేష్.

తాజాగా ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పవర్‌ఫుల్‌ పాత్ర కోసం కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. ఇక ఈ యుద్ధవిద్యను ఒక్క మహేష్ బాబు మాత్రమే కాదు.. ఇప్పటికే చాలామంది ప్రముఖులు, నటీనటులు కూడా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా శరీరాకృతి, మెదడు చురుకుదనం కోసం నేర్చుకుంటున్న ఈ కలరిపయట్టు ఫిట్‌నెస్‌కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఔషధాల కంటే మిన్నగా పనిచేసే ద్రాక్షపండ్లు.. గుండె నుంచి మెదడు వరకు ఫుల్ బెనిఫిట్స్!

కలరిపయట్టు అంటే ఏమిటి?

కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఈ కళను కలరిపయట్టు లేదా కళరి అని పిలుస్తారు. ఈ విద్యను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా చెబుతారు. ఈ యుద్ధవిద్యను ముఖ్యంగా కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పకుండా నేర్చుకుంటారట. ఈ విద్య వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు.. శరీరం, మనస్సును అప్రమత్తంగా, యాక్టివ్‌గా ఉంచడంలో ఈ కలరిపయట్టు కీలక పాత్ర పోషిస్తుంది.

కలరిపయట్టుతో కలిగే ప్రయోజనాలు:

Advertisement

⇒ ఈ కలరిపయట్టు ట్రైనింగ్‌లో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్చుకోవచ్చు. ఇది మన శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఉపకరిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

⇒ ఈ యుద్ధవిద్యలో ఉండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన మూవ్‌మెంట్స్ హార్ట్ రేటును పెంచుతాయి. దీంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

⇒ కలరిపయట్టు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలం పాటు శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

⇒ నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో శిక్షణ పొందితే.. మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైంది కూడా.

⇒ ఈ ప్రాచీన యుద్ధవిద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీరూ కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.

Also Read: మిగిలిపోయిన అన్నంతో గార్లిక్ ఫ్రైడ్ రైస్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!

 

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×