E-Paper
Advertisement

Hotel Rooms: సంక్రాంతి పండగ ఎఫెక్ట్.. కోడి పందెం రాయుళ్ల రాకతో హోటల్ యజమానుల జేబులు ఫుల్

Hotel Rooms: సంక్రాంతి పండగ ఎఫెక్ట్.. కోడి పందెం రాయుళ్ల రాకతో హోటల్ యజమానుల జేబులు ఫుల్
Advertisement

Hotel Rooms: ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే నగరం పల్లెబాట పట్టింది. మరోవైపు సంక్రాంతి అంటే ముందుగా గుర్తుచ్చేది కోడి పందాలు. అందులోనూ భీమవరం అంటే కోడిపందాలకు పెట్టింది పేరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే భీమవరంలో కోడి పందాలు చూసేందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్దఎత్తున పందెం రాయుళ్లు తరలివస్తుంటారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున కోడి పందాల బరులు రెడీ అవుతున్నాయి.

అయితే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అతిథులు స్టే చేయడానికి మాత్రం ఎక్కడా హోటళ్లు ఖాళీ ఉండడం లేదు. ఇంచుమించుగా అన్ని హోటళ్లు నిండిపోయాయి. ప్రతి హోటల్ బయట హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి హోటళ్ల యజమానులు షాక్ ఇస్తున్నారు. మొత్తం సంక్రాంతి నాలుగు రోజులు ప్యాకేజీలో రూములు తీసుకుంటేనే రూములు ఇస్తామంటూ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. గట్టిగా అడిగితే అసలు రూములే లేవంటూ కరాకండిగా చెప్పేస్తున్నారు.

Advertisement

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఏలూరు. తాడేపల్లిగూడెం. తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడుల్లో ఉన్న హోటళ్లలో ఉన్న దాదాపు అన్ని హోటళ్లలోనూ నో రూమ్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు కళ్యాణ మండపాలు, విడిది ఇళ్లులు సైతం నెల ముందుగానే బుక్ అయిపోయాయి. అయితే చాలా హోటళ్లలో నెలల ముందే రూమ్స్ బుక్ అయిపోయాయని హోటల్స్ యజమానులు చెప్తున్నారు.

ప్రస్తుతం భీమవరంలో చూస్తే పెద్ద హోటల్స్‌లలో సంక్రాంతి నాలుగు రోజులు కలిపి ప్యాకేజీల రూపంలో రూములు బుక్ అయ్యాయి. సాధారణ సమయంలో రూములకు ఒక రేటు ఉంటే సంక్రాంతి నాలుగు రోజులు మాత్రం ఆ రేటు మూడు రెట్లుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎంత ప్యాకేజీ అయినా పర్వాలేదు రూమ్ దొరికితే చాలు అన్నా కూడా రూమ్‌లు దొరికే పరిస్థితి లేదు. మరింత సమాచారం భీమవరం నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.

Advertisement

ALSO READ: మరణ శాసనం.. తన సమాధి తానే నిర్మించుకున్న జగిత్యాల వాసి

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×