E-Paper
Advertisement

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా
Advertisement

Romantic Drama: కొన్నిసార్లు మనిషికి కావాల్సింది డబ్బు, సౌకర్యాలు కాదు… తనను నిజంగా అర్థం చేసుకునే ఒక్క మనిషి. చిన్నప్పటి నుంచి ప్రేమకు దూరంగా పెరిగినా, జీవితంలో వరుసగా ఎదురు దెబ్బలు తగిలినా బయటకు మాత్రం నవ్వుతూ ఉండొచ్చు. కానీ లోపల పేరుకుపోయిన బాధను మర్చిపోవడానికి తప్పుడు అలవాట్లకు బానిసైతే, మనల్ని ప్రేమించే వ్యక్తి వచ్చినా మారగలమా ? ప్రేమ మనిషిని మార్చగలదా, లేక మారాలనే నిర్ణయం మన నుంచే రావాలా ? ఈ ప్రశ్నలకు భావోద్వేగాలతో సమాధానం చెప్పే ప్రయత్నమే ‘యెన్ ఎన్నై ఏదో సెయ్దాయ్’ (Yen Ennai Edho Seidhai). మరి ఈ ఎమోషనల్ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కార్తీక్ సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే యువకుడు. ఉద్యోగం ఉంది, స్నేహితులున్నారు. సరదాగా గడపడానికి ఏ లోటూ లేదు. కానీ అతని జీవితంలో లేనిది మాత్రం మనసుకు దగ్గరగా ఉండే మనిషి. చిన్నతనంలో తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేమకు కూడా దూరమైన కార్తీక్ ఒంటరితనాన్ని మర్చిపోవడానికి మద్యానికి అలవాటు పడతాడు. స్నేహితులతో తిరుగుతూ, మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ రోజులు గడుపుతుంటాడు. అయినా అతని మనసులోని ఖాళీ మాత్రం అలాగే ఉండిపోతుంది.

Advertisement

అలాంటి సమయంలో అతని జీవితంలోకి మధు వస్తుంది. ఆమె ఓ బెంగాలీ యువతి. పరిస్థితుల కారణంగా ఎస్కార్ట్‌గా పని చేస్తూ, తన కూతురిని కోడైకెనాల్‌ లోని బోర్డింగ్ స్కూల్‌లో చదివిస్తుంటుంది. మొదట కార్తీక్ ఆమెను తనతో సమయం గడపడానికి పిలుస్తాడు. అయితే వారి పరిచయం కేవలం డబ్బు కోసం ఏర్పడిన సంబంధంగానే మిగిలిపోదు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కార్తీక్‌కు మధు దగ్గరగా ఉండడం నచ్చుతుంది. మధుకు కూడా అతనిపై అభిమానం పెరుగుతుంది. అలా వారి మధ్య ప్రేమ మొదలవుతుంది.

మధుతో కలిసి జీవించాలని కార్తీక్ నిర్ణయించుకుంటాడు. ఆమె కూడా తన వృత్తిని వదిలి అతనితో కొత్త జీవితం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుంది. కానీ ప్రేమలో ఉన్నప్పుడు కనిపించని సమస్యలు కలిసి జీవించడం మొదలుపెట్టాక బయటపడతాయి. కార్తీక్ మద్యపానం, కోపం వారి బంధంలో చిచ్చు పెడతాయి. ఒక గొడవలో అతను మాట్లాడిన మాటలకు మధు మనసు విరిగిపోతుంది. తన కూతురి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆమె కార్తీక్‌ను విడిచి వెళ్లిపోతుంది. అప్పుడే అతను తన తప్పు తీవ్రతను గ్రహిస్తాడు. మధును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఆమె అతన్ని క్షమిస్తుందా ? వారి ప్రేమకు మరో అవకాశం దొరుకుతుందా ? అన్నదే మిగతా కథ.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

Advertisement

ఈ సినిమా తమిళంలో రూపొందింది. డి. ఆంథోనీ (D Anthony) దర్శకత్వం వహించడంతో పాటు కార్తీక్‌గా నటించారు. మధుమిత దాస్ (Madhumita Das), జీవా రవి (Jeeva Ravi), రెజిన్ రోజ్ (Regin Rose) తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఆహా (Aha Tamil)లో అందుబాటులో ఉంది. తమిళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఒంటరితనం, ప్రేమ, మనిషిలో మార్పు వంటి అంశాలతో సాగే సహజమైన పాయింట్స్ తో సినిమా ఎమోషనల్ గా సాగుతుంది. అయితే మూవీకి సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి చిన్న పిల్లలతో చూడకపోవడమే బెటర్.

Read Also: సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

Tags

Related News

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

Big Stories

Advertisement
×