Travel eSIM Apps: అరకొర రోమింగ్ ప్యాక్‌లు, ఎయిర్‌పోర్టుల్లో సిమ్ కార్డుల కోసం లైన్లలో నిలబడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్లే వాళ్లంతా టెక్నాలజీతో పాటు అప్‌డేట్ అవుతున్నారు. మన దేశం నుంచి బయటికి వెళ్లేటప్పుడే మొబైల్‌లో ఈ-సిమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, డేటా ప్లాన్ ఆక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. విదేశాల్లో దిగగానే నెట్ పనిచేయడం మొదలవుతుంది. ట్రెడిషనల్ రోమింగ్ ప్యాక్‌లతో పోలిస్తే.. ఇది చాలా చౌకగా ఉండటమే కాకుండా, పెద్దగా ఖర్చు కూడా ఉండదు.
మీ ట్రిప్‌కి సరిపోయే యాప్‌ని ఎంచుకునే ముందు కొన్ని విషయాలు చూసుకోవాలి. ముందుగా మీరు వెళ్లే దేశానికి ఆ యాప్‌లో నెట్‌వర్క్ కవరేజ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఊరికే ఎవరో చెప్పారు కదా అని ఏదీ సెలెక్ట్ చేయకుండా.. మన అవసరానికి తగిన డేటా ప్యాక్ ఏది ఉందో బేరీజు వేసుకోవాలి. అలాగే, వాడేటప్పుడు అదనపు ఛార్జీలు పడకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదివితే మంచిది. ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం అక్కడ లోకల్ టెలికాం కంపెనీలతో ఆ యాప్‌కి టైఅప్ ఉందా లేదా చూసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: కేవలం రూ.17 వేలకే హైయర్ ఫ్రిజ్.. అమెజాన్ సేల్‌లో కస్టమర్లకు పండగలాంటి ఆఫర్లు!
సాధారణంగా మన మొబైల్ ఆపరేటర్లు ఇచ్చే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లు చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాకపోతే.. పాత సిమ్‌తోనే పని అయిపోతుంది కాబట్టి కాస్త సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ, ఈ-సిమ్ యాప్‌లు మాత్రం అలా కాదు. ఇవి మన బడ్జెట్‌కు తగినట్టుగా కేవలం ఇంటర్నెట్ ప్లాన్‌లను మాత్రమే ఎంచుకునే వెసులుబాటు ఇస్తాయి. ఎంబీలు, జీబీలు ఎంత కావాలంటే అంత ప్లాన్ తీసుకోవచ్చు. ఫోన్ కాల్స్ అవసరం లేదనుకునేవాళ్లకు ఈ-సిమ్స్ బెస్ట్ ఛాయిస్.
ప్రస్తుతం మార్కెట్లో చాలా మంచి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, ఎయిరాలో, హోలాఫ్లై, నోమాడ్, సైలీ, యుబిగి వంటి యాప్స్ దాదాపు 200లకు పైగా దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. వీటిలో కొన్ని యాప్స్ అన్‌లిమిటెడ్ డేటా ఇస్తుండగా.. మరికొన్ని యాప్స్ యాడ్-బ్లాకర్స్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. కొన్ని యాప్స్ అయితే కాల్స్, మెసేజ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి.
చాలామంది ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మొబైల్ డేటాను హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఈ-సిమ్ యాప్‌లు హాట్‌స్పాట్ షేరింగ్‌ను బ్లాక్ చేస్తుంటాయి. అందుకే, యాప్ సెలెక్ట్ చేసుకునే ముందే ఈ ఫీచర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే విదేశాల్లో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది.