E-Paper
Advertisement

ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య

ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య
Advertisement

Andhra university:కొందరు రాజకీయ నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు కొన్ని నిజాలు చెబుతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా అస్సల పట్టించుకోరు. చెప్పాల్సిన విషయాలను బయటపెడతారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అదే చేశారు. తనకు యూనివర్సిటీలకు రావడానికి అర్హత లేదని మనసులోని మాట బయటపెట్టారు.

విశాఖలో ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్

Advertisement

బుధవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో మెగా కల్చరల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలకు రావడానికి తను ఏమాత్రం అర్హత లేదన్నారు. అర్హత లేకున్నా ప్రేమతో పిలవడంతో వచ్చానని మనసులోని మాట బయటపెట్టారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత నుంచి ఎదురయ్యే ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయన్నారు. రాష్ట్ర పునః నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. మీ చర్యలు, మీ విజ్ఞానం, ఆలోచనలు పరిష్కార మార్గాలుగా మారాలన్నారు. బలమైన నమ్మకంతో కలలు కనాలని, నిరంతర కృషి, నిబద్ధతతో నాయకత్వం వహించాలన్నారు.

Advertisement

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య

భావితరమే తనను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చిందన్నారు. భగత్‌సింగ్ సహా చిన్న వయసులో ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు స్పూర్తిగా ప్రస్తావించారు. చదివిన చదువు వృథా కాదని, తాను యూనివర్సిటీకి వెళ్లలేదని, కానీ పీహెచ్‌డీ విద్యార్థి మాదిరిగా పుస్తకాలు చదువుతానని అన్నారు.

సాంప్రదాయ విద్య లేకపోవడం తనకు మంచి జరిగిందని అనుకుంటానని వెల్లడించారు. వందశాతం మంచి అనేది ఏ వ్యక్తిలోనూ ఉండదని, కేవలం ఎదుటివాళ్లను మంచిని చూడడం అలవాటు చేసుకోవాలన్నారు. తాను కూడా అదే ఫాలో అవుతానని తెలిపారు. సమాజం పిరికి తనంతో ముడుచుకుపోయినప్పుడు తాను రాజకీయ పోరాటం మొదలెట్టానన్నారు. ఓటమికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ALSO READ: చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!

పవన్ కళ్యాణ్ సహా రాజకీయ నాయకులు ఎవరు నచ్చకపోయినా పక్కన పడేయాలన్నారు. పార్టీల సిద్ధాంతాలు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుకూలమా ఉన్నాయా లేవా అనేది నిర్ణయించుకోవాలన్నారు. వాస్తవిక దృక్పథం లేని ఐడియాలజీ నమ్ముకుని అడవులకు వెళ్లిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. పాతికేళ్లు రాజకీయాల్లో ఉంటానని నలిగి, దెబ్బతిని మాట్లాడుతున్నానని వెల్లడించారు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×