E-Paper
Advertisement

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?
Advertisement

జాబ్ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. వాటిలో ఎక్కువగా ఆ ఉద్యోగానికి సంబంధించినవే ఉంటాయి. కానీ, కొన్ని ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విషయాలను కూడా ఆరా తీస్తున్నారట. ఇది తమకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, తాము ఆ జాబ్‌కు తాము ఎంత వరకు అర్హులమో తెలుసుకొనే విధంగా ప్రశ్నలుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొత్తగా పెళ్లయిన ఓ యువతి కూడా తనకు ఇంటర్వ్యూలో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీన్నిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక వర్గం ఆమెకు మద్దతుగా మాట్లాడుతుంటే.. ఇంకో వర్గం హెచ్ఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన ప్రశ్న ఏమిటీ? జనాలు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారో చూద్దాం.

అసలేం జరిగింది?

శతాక్షి ద్వివేది అనే మహిళ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడ ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ నన్ను అనుచితమైన ప్రశ్న అడిగారని ఆమె పేర్కొంది. ఇంటర్వ్యూ ప్రారంభంలో ఆఫీస్‌కు రాకపోకలు సాగించడం, ఎక్కడ నివసిస్తున్నారు? తదితర సాధారణ అంశాలపై సాగిందని తెలిపింది. తన భర్త కూడా అదే ప్రాంతానికి ప్రయాణిస్తారని, కాబట్టి ప్రయాణం సమస్య కాదని తాను సమాధానం ఇచ్చానని ఆమె పేర్కొంది. తనకు ఇటీవలే పెళ్లయిందనే విషయం తెలియగానే హెచ్ఆర్ వైఖరి మారిపోయిందని తెలిపింది. ‘‘మీరు పెళ్లయినట్లు చెప్పారు. ఇప్పుడు నేను ఓ విషయం అడిగితే ఏమీ అనుకోరు కదా. త్వరలోనే ఏమైనా పిల్లలను కనే ఆలోచన ఉందా’’ అని నేరుగా ప్రశ్నించారని పేర్కొంది.

చాలా అసౌకర్యానికి గురయ్యా..

Advertisement

హెచ్ఆర్ అడిగిన ఈ ప్రశ్న వల్ల తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని ద్వివేది పేర్కొంది. బయటకు మహిళా సాధికారత గురించి గొప్పగా మాట్లాడే సంస్థలు.. ప్రాక్టికల్‌గా ఎంతో వివక్ష చూపిస్తాయని తెలిపింది. అలా ప్రశ్నించడానికి వారికి మనసు ఎలా వస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. కామెంట్లలో చాలామంది మహిళలు తమకూ ఇలాంటి ఇబ్బందికరమైన అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. పెళ్ళికాని మహిళలను.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతారని, పెళ్ళయిన వారిని పిల్లలు ఎప్పుడు అని అడుగుతారని.. పిల్లలు ఉన్న వారిని ఉద్యోగం, పిల్లలను ఎలా మేనేజ్ చేస్తారు? అని అడుగుతారంటూ ఓ యూజర్ పేర్కొంది. 22 ఏళ్ల వయస్సు నుంచి 50 ఏళ్ల దాకా కార్పొరేట్ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు ఈ తరహా ప్రశ్నలు తప్పడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా మేనేజర్ తాను పెళ్లయిన మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోనని చెప్పిన అనుభవాన్ని కూడా ఒక యూజర్ పేర్కొంది.

Also Read: సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

అలాంటి ప్రశ్నలకు కారణం.. ఈ సమస్యలే..

Advertisement

ఉద్యోగుల కోణం నుంచి చూస్తే.. హెచ్ఆర్ అడిగే ప్రశ్న చాలా అనుచితంగా అనిపించవచ్చు. కానీ, ఒక్కోసారి మనం ఆ వ్యాపార సంస్థ లేదా కంపెనీ తరపున కూడా ఆలోచిస్తే మంచిదని మరికొందరు యూజర్స్ పేర్కొన్నారు. ఇది లింగ వివక్ష కాదు, వ్యాపార నిర్వహణకు సంబంధించిన ఆచరణాత్మక సమస్య అని వారు వాదిస్తున్నారు. ఒక అభ్యర్థి చేరిన కొద్ది నెలలకే ప్రసూతి సెలవులపై (Paid Maternity Leave) వెళితే, కంపెనీలకు తాత్కాలికంగా ఆ స్థానాన్ని భర్తీ చేయడం, ప్రాజెక్ట్ పనులను నిర్వహించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. కొందరు అభ్యర్థులు గర్భవతి అనే విషయాన్ని దాచి ఉద్యోగంలో చేరి, ప్రోబేషన్ పూర్తయ్యాక 6, 7 నెలల లీవ్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొంది, ఆ తర్వాత రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే కొంతమంది హెచ్ఆర్‌లు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. మరి, దీనిపై మీరేమంటారు?

Tags

Related News

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని మెడనొప్పిగా ఉందా? ఈ సింపుల్ వ్యాయామాలు చేస్తే సరి

రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!

ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారా? ఇలా చేస్తే నొప్పి అసలు తెలియదు

పనీర్ తయారు చేశాక మిగిలిన నీటిని పారేస్తున్నారా? ఇలా చేస్తే టేస్టీ సూప్ రెడీ

Big Stories

Advertisement
×