E-Paper
Advertisement

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?
Advertisement

సముద్రంలో ఉన్నంత వరకు.. అవి సాధారణ రాళ్లలాగానే కనిపించాయి. పరిశోధనల కోసం వాటిని సముద్రం నుంచి సాధారణ వాతావరణంలోకి తీసుకురాగానే.. ఒక్కసారే భగ్గుమన్నాయి. దీంతో శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు అవి రాళ్లేనా? సముద్రం నుంచి బయటకు రాగానే ఎందుకు మండిపోయాయి? వంటి ప్రశ్నలు సందేహాలతో.. అసలు విషయం తెలుసుకొనే పనిలో పడ్డారు. మొత్తానికి దాని రహస్యాన్ని తెలుసుకుని ప్రపంచం ముందుంచారు.

ఆ రాళ్లు ఎక్కడ దొరికాయి?

మన భూగ్రహంలో 70 శాతం సముద్రమే ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయినా.. ఈ సముద్రం గురించి మనకు తెలిసిందే కేవలం గోరంతే. ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు కలిగిన ఈ సంద్రంలో కేవలం జీవులే కాదు.. శిలలు సైతం చాలా భిన్నమైనవి. భూమి మీద ఉండే రాళ్ల కంటే.. చిత్రవిచిత్రమైన స్వభావంతో ఉంటాయి. అందుకే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS), నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) నిత్యం సముద్రంలో జరిగే మార్పులు గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా వాటిలో రాళ్లను పరిశీలిస్తుంటారు. తాజాగా ఓరెగాన్ – కాలిఫోర్నియా తీర ప్రాంతంలోని ‘ఎస్కనాబా ట్రఫ్’ వద్ద ప్రయోగాలు చేపట్టారు. సముద్రం లోయల్లో నిజ సమృద్ధిగా ఉండే రాళ్ళను సేకరించారు. వాటిని సముద్రం నుంచి బయటకు తీసి.. ప్రయోగాశాలకు తరలిస్తున్న సమయంలో వాటికవే మండిపోయాయి. సుమారు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో మండిపోతూ ఆక్సిడైజ్ అయ్యాయి.

ఆ రాళ్లల్లో సమృద్ధిగా వెండి, బంగారం..

Advertisement

లోతైన సముద్రంలోకి డైవింగ్ చేయడం చాలా కష్టం. అక్కడ ఉండే ఒత్తిడికి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అలాగే అక్కడి నీరు చాలా చల్లగా ఉంటాయి. అందుకే పరిశోధకులు ROV Jason అనే ఆటోమేటెడ్ రోబోటిక్ పరికరం సహాయంతో.. దాదాపు 57 రాతి నమూనాలను సేకరించారు. ఈ రాళ్లలో రాగి, జింక్, ఇనుము, బంగారం, వెండి వంటి అమూల్యమైన లోహాలతో కూడిన సల్ఫైడ్ ఖనిజాలు ఉన్నాయి. పరిశోధకులు ఈ రాళ్ళను లాబొరేటరీకి తీసుకొచ్చి ఎండబెట్టారు. ఆ తర్వాత వాటిని పొడిచేయడం ప్రారంభించారు. అప్పుడే వాటి నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు మొదలయ్యాయి.

నీటిలో ఉండే రాళ్ళు బయటకు రాగానే ఎందుకు కాలాయి?

రాళ్ళలో పెట్రోలియం లేదా తార్ వంటి పదార్థాలు ఉండటం వల్ల మంటలు వచ్చి ఉంటాయని తొలుత భావించారు. అసలైన కారణాలు తెలుసుకోడానికి మరింత లోతుగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కీలక విషయాలు తెలిశాయి. ఈ రాళ్ళలో నానోక్రిస్టలైన్ మార్కసైట్ అనే ఒక రకమైన ఐరన్ సల్ఫైడ్ అధికంగా ఉంది. ఇది చాలా అస్థిరమైనది. సముద్రం అడుగున తీవ్రమైన ఒత్తిడి, తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉండే ఈ రాళ్ళు భూమి ఉపరితలానికి రాగానే గాలిలోని ఆక్సిజన్ తో ప్రతిచర్య జరిపాయి. రాళ్ళను నలిపినప్పుడు ఏర్పడిన ఉష్ణోగ్రత వల్ల వేగవంతమైన ఆక్సిడేషన్ జరిగి, రాళ్ళు అత్యధిక వేడిని ఉత్పత్తి చేస్తూ మండిపోయాయి.

Advertisement

Also Read: ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

పెద్ద ప్రమాదం తప్పినట్లే..

సముద్ర గర్భంలో మైనింగ్ చేపట్టాలని పలు పరిశ్రమలు భావిస్తున్నాయి. శాస్త్రవేత్తలు కూడా వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. తాజా ఘటనతో వారి కళ్లు తెరుచుకున్నాయి. ఎలాంటి అవగాహన లేకుండా సముద్ర గర్భంలో మైనింగ్ చేయడం ఎంత ప్రమాదకరమనేది పరిశోధకులు తెలుసుకున్నారు. భూమిపై లభించే సల్ఫైడ్ రాళ్ళ కంటే సముద్ర గర్భంలో లభించే ఈ ఖనిజాల రసాయన స్వభావం భిన్నంగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఆ ఖనిజాలను మైనింగ్ చేసి.. ఓడల్లోకి తరలించేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి మైనింగ్ సంస్థలు ప్రత్యేకమైన భద్రతా నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు.

Tags

Related News

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!

ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్..చాటింగ్ స్టైల్ మారబోతోంది బాస్

యాప్స్, ఫొటోస్ డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ అని వస్తోందా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ ట్రై చేయండి!

ల్యాప్‌టాప్‌‌పై నీళ్లు పడ్డాయా? ఆన్ చేసే.. ముందు ఈ ఒక్క తప్పు చేయెద్దు!

విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు

Big Stories

Advertisement
×