E-Paper
Advertisement

Curd Face Packs: డల్ స్కిన్‌తో విసిగిపోయారా? పెరుగులో వీటిని కలిపి వాడితే చర్మం నిగారిస్తుంది!

Curd Face Packs: డల్ స్కిన్‌తో విసిగిపోయారా? పెరుగులో వీటిని కలిపి వాడితే చర్మం నిగారిస్తుంది!
Advertisement

Curd Face Packs: రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం వలన ఆరోగ్య సమస్యలే కాదు.. చర్మ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్ని క్రీములు వాడినా ఫేస్ మాత్రం డల్‌గా అనిపిస్తోందని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు వేలకు వేలు ఖర్చు పెట్టి ఖరీదైన క్రీములు వాడనవసం లేదు. మన వంటింట్లో దొరికే తాజా పెరుగుతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, ముఖానికి కావాల్సిన తేమను అందిస్తుంది.

తేనె – పసుపుతో మెరుపు:

చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటే, పెరుగులో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించండి. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేసి, ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఒకవేళ మొటిమల సమస్య ఉన్నట్లయితే.. పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. పసుపులోని యాంటీ సెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచుతాయి.

Advertisement

Also Read: మీ వంటింట్లో ఈ మార్పులు చేసుకుంటే.. జిమ్‌కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు!

టాన్, మురికికి చెక్:

ఎండలో తిరిగి వచ్చినప్పుడు చర్మం నల్లగా మారితే, పెరుగులో అలోవెరా జెల్ కలిపి రాసుకుంటే చర్మం చల్లబడి, టాన్ క్రమంగా తగ్గుతుంది. అలాగే ముఖంపై పేరుకుపోయిన మురికిని వదిలించుకోవడానికి శనగపిండి లేదా బియ్యం పిండిని పెరుగుతో కలిపి స్క్రబ్‌లా వేసుకోండి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

ఇన్‌స్టంట్ గ్లో కావాలంటే:

Advertisement

జిడ్డు చర్మం ఉన్నవారు పెరుగులో ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్ వేసుకుంటే.. ముఖం మీద ఉన్న జిడ్డు తొలగిపోయి తాజాగా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లే ముందు ఐదు నిమిషాల్లో మెరుపు కావాలనుకుంటే, పెరుగులో కొంచెం కాఫీ పొడి కలిపి ముఖానికి మసాజ్ చేసుకోండి. ఇది కళ్ల కింద నలుపును తగ్గించి, ముఖానికి ఇన్‌స్టంట్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. ఈ సహజమైన పద్ధతులను పాటిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

Also Read: బిగినర్స్ కోసం బెస్ట్ టిప్స్.. మీ జిమ్ బ్యాగులో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి!

Tags

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×