PAK Cricketers: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై సొంత దేశపు మాజీ క్రికెటర్లు విషం చిమ్ముతున్నారు. చేతకాని దద్దమ్మలు అంటూ పాకిస్తాన్ క్రికెటర్ల పై ఫైర్ అవుతున్నారు మాజీలు. ఈ నేపథ్యంలోనే మహ్మద్ యూసఫ్ కూడా స్పందించారు. పాకిస్తాన్ క్రికెటర్ల పై ( Pakistan Cricketers) విరుచుకుపడ్డారు మహ్మద్ యూసఫ్ ( Muhammad Yousuf ). పాకిస్తాన్ జట్టులో ఉన్న క్రికెటర్లకు కొమ్ములు వచ్చాయని… ఫోన్లలో మునిగిపోవడం తప్ప ప్రాక్టీస్ మాత్రం చేయాలని ఫైర్ అయ్యారు. 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇండియాను ఓడించిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లకు బలుపు బాగా పెరిగిందని నిప్పులు చెరిగారు మహ్మద్ యూసఫ్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సరిగ్గా ఆడడం లేదని చురకలు అంటించారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు కాలరాత్రి మిగిల్చింది టీమిండియా. పాకిస్తాన్ పై ఏకంగా 61 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు సరిగ్గా ఆడలేదు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లపై మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. షాహీన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, బాబర్ ఆజం లాంటి ప్లేయర్లను పాకిస్తాన్ నుంచి తొలగించాలని షాహిద్ ఆఫ్రీది అలాగే మహమ్మద్ యూసఫ్ లాంటి ప్లేయర్లు డిమాండ్ చేశారు.
ఈ ముగ్గురు క్రికెటర్లు జట్టులో ఉంటే పాకిస్తాన్ గెలవడం అసాధ్యమన్నారు. వెంటనే ఆ ముగ్గురు క్రికెటర్లను తొలగించాలని.. కొత్త క్రికెటర్లను తీసుకోవాలని మహమ్మద్ యూసఫ్ పేర్కొన్నారు. 2021 సంవత్సరంలో దుబాయ్ ( Dubai) వేదికగా ఇండియాను పాకిస్తాన్ చీల్చి చెండాడిన విషయాన్ని గుర్తు చేశారు మహమ్మద్ యూసఫ్. ఈ విజయం తర్వాత పాకిస్తాన్ కు బలుపు పెరిగిందని మండిపడ్డారు. 2021 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లకు కొమ్ములు మొలిచాయని మండిపడ్డారు. కోచ్ మాట అస్సలు వేయడం లేదని.. ఫోన్ లలో మాత్రమే మునిగిపోతున్నారని చురకలు అంటించారు మహమ్మద్ యూసఫ్. ఇందుకే మొన్నటి మ్యాచ్ లో టీమిండియా చేతిలో దారుణంగా పాకిస్తాన్ ఓడిపోయిందని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితేనే పాకిస్తాన్ విజయం సాధిస్తుందని సూచనలు చేశారు మహమ్మద్ యూసఫ్.
Mohammad Yousuf takes on Shahid Afridi’s and Saqlain Mushtaq’s sons-in-law on national television.pic.twitter.com/0z3A6CdNWk
— Cricketopia (@CricketopiaCom) February 17, 2026