E-Paper
Advertisement

Gym Essentials: బిగినర్స్ కోసం బెస్ట్ టిప్స్.. మీ జిమ్ బ్యాగులో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి!

Gym Essentials: బిగినర్స్ కోసం బెస్ట్ టిప్స్.. మీ జిమ్ బ్యాగులో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి!
Advertisement

Gym Essentials: బాడీ ఫిట్‌నెస్ కోసమో.. హెల్దీ లైఫ్ కోసమో జిమ్‌లో అడుగు పెట్టాలని నిర్ణయించుకోవడం మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి. అయితే, ఉత్సాహంగా వర్కవుట్లు మొదలుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. సరైన సన్నద్ధత లేకపోతే జిమ్ ప్రయాణం భారంగా అనిపించవచ్చు. అందుకే కొత్తగా జిమ్‌కు వెళ్లేవారు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలేవో ఇప్పుడు చూద్దాం.

ఈ రెండూ ముఖ్యమే:

చాలామంది వ్యాయామం అలవాటు అయ్యే వరకు ఏదో ఒక పాత బూట్లు లేదా బిగుతుగా ఉండే దుస్తులతో మేనేజ్ చేద్దామనుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. నాసిరకం బూట్లు వాడటం వల్ల పాదాల నొప్పి, మోకాళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే గాలి ఆడని దుస్తులు ధరిస్తే శరీరం త్వరగా వేడెక్కి, విపరీతమైన చెమట వల్ల మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి.. శరీరానికి సౌకర్యంగా ఉండే ట్రాక్ సూట్లు, బ్రాండెడ్ స్పోర్ట్స్ షూస్ ఎంచుకోవడం వల్ల మీ ఉత్సాహం రెట్టింపవుతుంది.

Advertisement

Also Read: క్యాన్సర్ కణాలకు మరణశాసనం.. కొత్త యాంటీబాడీతో ప్రాణాంతక వ్యాధికి అడ్డుకట్ట!

ఎల్లప్పుడూ మీ వెంట ఉండాల్సింది? 

వ్యాయామం చేసేటప్పుడు శరీరం ద్రవాలను కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడి కళ్లు తిరగడం, నీరసం రావచ్చు. అందుకే ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోండి. వర్కవుట్ మధ్యలో దాహం వేసినప్పుడు ఒకేసారి ఎక్కువగా తాగకుండా, చిన్న చిన్న గుటకలు వేస్తూ ఉండాలి. ఇది మీ గుండె వేగాన్ని అదుపులో ఉంచి, మీరు ఎక్కువ సేపు వ్యాయామం చేసేలా సహకరిస్తుంది.

వార్మ్‌అప్‌, స్ట్రెచింగ్:

Advertisement

జిమ్‌లోకి వెళ్లగానే నేరుగా బరువులు ఎత్తడం వంటివి చేయకూడదు. మీరు చేసే వ్యాయామం ఏదైనా సరే, దానికి ముందు శరీరాన్ని సిద్ధం చేయడానికి వార్మ్‌అప్ తప్పనిసరి. మొత్తం వ్యాయామ సమయంలో పావు వంతు సమయాన్ని దీనికే కేటాయించాలి. ఇది కండరాలను ఫ్లెక్సిబుల్‌గా మారుస్తుంది. ఇక ఒంటిని సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలను వర్కవుట్ చివర్లో చేయడం వల్ల ఒళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి.

Also Read: మీ వంటింట్లో ఈ మార్పులు చేసుకుంటే.. జిమ్‌కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×