E-Paper
Advertisement

Dandruff Home Remedies: చలికాలంలో చుండ్రు వల్ల జుట్టు రాలుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే రిజల్ట్ పక్కా!

Dandruff Home Remedies: చలికాలంలో చుండ్రు వల్ల జుట్టు రాలుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే రిజల్ట్ పక్కా!
Advertisement

Dandruff Home Remedies: చలికాలం చల్లదనాన్ని, ఉపశమనాన్ని తెస్తుంది. అలాగే ఇది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను కూడా పెంచుతుంది. వింటర్ లో చాలా మంది ఎదుర్కునే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. ఈ సీజన్‌లో చల్లని గాలి, తక్కువ తేమ, పొడి చర్మం చుండ్రును పెంచుతాయి. ఇది జుట్టు రాలడం , దురద వంటి వాటికి దారితీస్తుంది. చుండ్రు అనేది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు.. జుట్టు మూలాలను కూడా బలహీన పరుస్తుంది. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ..ఇందుకు హోం రెమెడీస్ అద్భుత ప్రయోజనాలను అందిస్తాయి. చలికాలంలో చుండ్రును తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ హోం రెమెడీస్ తో చుండ్రుకు చెక్:
కొబ్బరి నూనె, నిమ్మకాయ: కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తుంది. అంతే కాకుండా నిమ్మరసంలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో సహాయ పడతాయి. గోరు వెచ్చని కొబ్బరి నూనెను తీసుకుని.. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, తలకు మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.

Advertisement

పెరుగు : పెరుగు తలకు ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. వారానికి ఒకసారి మీ జుట్టుకు పెరుగును అప్లై చేసి 20-25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇది దురదను తగ్గిస్తుంది. క్రమంగా చుండ్రును తొలగిస్తుంది. పెరుగులో ఎగ్ వైట్ కలిపి జుట్టుకు పట్టించాలి. తర్వాత 30 నిమిషాలకు తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు అవసరం అయిన పోషణ లభిస్తుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు మెరుస్తూ ఉండటంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

కలబంద జెల్ : కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. తాజా కలబంద జెల్ ను తలకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి. ఇది చుండ్రుతో పోరాడటానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది. అంతే కాకుండా చుండ్రు వల్ల వచ్చే దురదను కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

Advertisement

Also Read: శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైందా ? తగ్గించే మార్గాలివే !

సరైన షాంపూ, నీరు: చలికాలంలో వేడి నీటితో తలస్నానం చేయడం మానుకోవాలి. గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడండి. రసాయనాలు లేని.. షాంపూలను ఎంచుకోండి. వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి: చుండ్రు బాహ్య కారకాల వల్ల మాత్రమే కాకుండా అంతర్గత కారకాల వల్ల కూడా వస్తుంది. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గింజలు, పుష్కలంగా నీరు చేర్చుకోండి. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×