E-Paper
Advertisement

Trivikram Movie : ఆ మూవీ టైటిల్ త్రివిక్రమ్‌కి కాదు… అంతా నాగ వంశీ ప్లాన్?

Trivikram Movie : ఆ మూవీ టైటిల్ త్రివిక్రమ్‌కి కాదు… అంతా నాగ వంశీ ప్లాన్?
Advertisement

Trivikram Movie : త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటే… ముందు ఆయన పెట్టే టైటిల్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అచ్చ తెలుగులో ఉంటుంది ఆ టైటిల్. కొంచెం లెంగ్తీగా ఉన్నట్టు ఉన్నా.. ఆడియన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. అలా ఇప్పటి వరకు అలా వైకుంఠపురములో… అరవింద సమేత వీర రాఘవ సినిమాలకు మనం చూశాం. ఇదిలా ఉండగా… నిర్మాత నాగ వంశీ ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ అచ్చతెలుగులో ఉంది. ఇంకెముంది.. అది త్రివిక్రమ్ కోసమే అనే ప్రచారం సాగింది.

మరి నిర్మాత నాగ వంశీ రిజిస్టర్ చేసిన టైటిల్ ఏంటంటే… “బంధుమిత్రుల అభినంద‌న‌ల‌తో” ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత.. అందరూ ఇది త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబో మూవీ కోసం అని అనుకున్నారు. బంధుమిత్రుల అభినంద‌న‌ల‌తో విక్టరీ వెంకటేష్ వస్తున్నాడు అంటూ ఫిక్స్ అయిపోయారు. సడన్‌గా వెంకటేష్ మూవీకి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ పెట్టి అనౌన్స్ చేశారు.

Advertisement

విక్టరీ వెంకటేష్ మూవీకి ఆదర్శ కుటుంబం అని పెడితే… మరి నాగ వంశీ రిజిస్ట్రేషన్ చేయించిన బంధుమిత్రుల అభినంద‌న‌ల‌తో సినిమా ఎవరితో చేస్తాడు అనే చర్చ జరిగింది. కొంత మంది అయితే.. అది త్రివిక్రమ్ కోసమే… రిజిస్ట్రర్ చేయించారని.. విక్టరీ వెంకటేష్ తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా టైటిల్ అని కూడా అనుకున్నారు. అయితే.. అవన్నీ ఇప్పుడు గాసిప్స్ అని తెలిసిపోయింది. బంధుమిత్రుల అభినంద‌న‌ల‌తో టైటిల్‌ను నాగ వంశీ ఓ యంగ్ డైరెక్టర్ కోసం రిజిస్టర్ చేయించాడంట.

టైటిల్ వీరి కోసమే..

సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా రాబోతుందట. బలగం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అతను ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడని సమాచారం. బలగం మూవీలా.. పక్కా తెలంగాణ నేపథ్యంలో సినిమా ఉండబోతుందట. తెలంగాణలో జరిగే పెళ్లి… తర్వాత ఉండే బరాత్… దావతలు అన్నీ కలిపి ఆ సినిమాను తెరకెక్కంచబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో మ్యాడ్ ఫేం రామ్ నితిన్ హీరోగా చేస్తున్నారంట.

నాగ వంశీ ప్లానా?

Advertisement

అయితే.. ఇది మొత్తం నాగ వంశీ ప్లాన్ అని అంటున్నారు ఇండస్ట్రీలో. ముందుగా టైటిల్ రిజిస్టర్ అయిన తర్వాత… అందరూ త్రివిక్రమ్ మూవీ అనుకోని.. కావాల్సినంత ప్రమోషన్స్ ఆ టైటిల్‌కి దక్కింది. ఇప్పుడు… సినిమా స్టార్ట్ అవ్వక ముందే.. టైటిల్ గురించి… డైరెక్టర్ గురించి.. సినిమా నేపథ్యం గురించి అందరూ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అలా… నాగ వంశీ ప్లాన్ వల్ల ఇప్పటి నుంచే మంచి ప్రమోషన్స్ దక్కుతున్నాయని అనే కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×