E-Paper
Advertisement

Dates Seeds: ఖర్జూరం మాత్రమే కాదు, వీటి విత్తనాలు తిన్నా కూడా అనేక ప్రయోజనాలు

Dates Seeds: ఖర్జూరం మాత్రమే కాదు, వీటి విత్తనాలు తిన్నా కూడా  అనేక ప్రయోజనాలు
Advertisement

Dates Seeds: సాధారణంగా ఖర్జూరం తిని మనం గింజలను పారేస్తాము. కాని ఖర్జూరాలే కాదు.. వాటి యొక్క గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా ?. ఖర్జూరం యొక్క  గింజలలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఖర్జూరం గింజల్లో ఫైబర్, ప్రొటీన్, యాంటీ యాక్సిడెంట్లతో పాటు ఖనిజాల కూడా అధిక మొత్తంలో ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న ఖర్జూరం గింజలు ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్: ఖర్జూర గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఖర్జూరం గింజలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

ప్రొటీన్: ఖర్జూర గింజల్లో ప్రొటీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో మరమ్మతులు, పెరుగుదలకు చాలా అవసరం.

యాంటీ ఆక్సిడెంట్లు: ఖర్జూర గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

Advertisement

విటమిన్లు, ఖనిజాలు: మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు వీటిలో ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ రకాల విధులు సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడతాయి.

ఖర్జూర గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

జీర్ణ వ్యవస్థ: జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూర విత్తనాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గుండె ఆరోగ్యం: ఖర్జూరం గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో , రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. గుండె ఆరోగ్యం కోసం ఖర్జూర గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

డయాబెటిస్ నియంత్రణ: ఖర్జూర గింజల పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు ఖర్జూర గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: ఖర్జూర గింజలలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని తక్కువ తినేలా చేస్తుంది . అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జుట్టుకు మేలు చేస్తుంది: ఖర్జూర గింజలు నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా జుట్టును బలపరుస్తాయి. వీటిలోని పోషకాలు జుట్టుకు  మేలు చేస్తాయి.

క్యాన్సర్ నివారణ: ఖర్జూర విత్తనాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

Also Read: కంటి ఆరోగ్యం కోసం.. ఈ డ్రైఫ్రూట్ తినాల్సిందే !

ఖర్జూర విత్తనాలను ఎలా ఉపయోగించాలి ?

ఖర్జూర గింజల పొడి: ఖర్జూర గింజలను పొడిగా చేసి స్మూతీలు, పెరుగు లేదా ఇతర పదార్థాలలో కలిపి తినవచ్చు. ఇలా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

ఖర్జూర గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొంతమందికి వీటి వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఖర్జూర గింజలు తినడం ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×