Priyanka Chopra: ప్రియాంక చోప్రా (Priyanka Chopra) .. బాలీవుడ్ నటి అయిన ఈమె హాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది.అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల మేర పారితోషకం తీసుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా ఎప్పుడైతే రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Maheshbabu) హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) లో భాగమైంది అని తెలిసిందో.. ఇక అప్పటినుంచి ఈమె పేరు బాగా మారుమ్రోగిపోతోంది. దీనికి తోడు హైదరాబాద్ లో బాలాజీ టెంపుల్ లో స్వామివారిని దర్శించుకున్న ఈమె ఈమధ్య మరింతగా వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా ప్రియాంక చోప్రా కుటుంబంలో పెళ్లి సందడి మొదలయ్యింది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా (Siddharth Chopra) ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయా (Neelam Upadhyaya) ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఈ మేరకు సిద్ధార్థ్ చోప్రా నీలం ఉపాధ్యాయ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ పెళ్లి కోసమే తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఇండియా చేరుకున్న ఈమె, తాజాగా సోదరుడి ఎంగేజ్మెంట్ కి హాజరై ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోదరుడికి కాబోయే భార్యను వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా..
ఇకపోతే సిద్ధార్థ చోప్రా ఒక డేటింగ్ యాప్ ద్వారా నీలం ఉపాధ్యాయాలను కలిశాడని ప్రియాంక చోప్రా తెలిపింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది అని, అయితే ఈ డేటింగ్ యాప్ లో తను పెట్టుబడి పెట్టడమే కాకుండా ఆ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నానంటూ తెలిపింది. ఇక దీనిపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. మేము యుఎస్ కి చెందిన డేటింగ్ యాప్ ను ఇండియాకి కూడా తీసుకొచ్చాము. నా సోదరుడు కూడా తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలుసుకున్నాడు. అతనికి సరైన జోడి దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. అయితే తాను ఎప్పుడూ కూడా డేటింగ్ యాప్ ను ఉపయోగించలేదని, నేరుగా వెళ్లి కలవాలని అనుకున్నాడని, అయితే ఇలా తన అభిప్రాయాన్ని చూసి కొంతమంది పాతకాలం వ్యక్తిగా పరిగణిస్తారు అని అన్నారని,” ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ట్విట్టర్ ద్వారా భర్తతో పరిచయం..
ఇకపోతే ప్రియాంక చోప్రా కూడా తన భర్త అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ట్విట్టర్ ద్వారా కలుసుకుంది. ఇక మొదట కలవాలనుకొని.. ఆస్కార్ వేడుక తర్వాత ఒక పార్టీలో కలుసుకున్నారు. 2017 లో ఇద్దరు కలిసి మెట్ గాలాకి కూడా హాజరయ్యారు. ఇక 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు.