E-Paper
Advertisement

Diabetes : షుగర్‌ ఉన్నవాళ్లు దీన్ని అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

Diabetes : షుగర్‌ ఉన్నవాళ్లు దీన్ని అస్సలు తినకూడదు.. ఎందుకంటే?
Advertisement
Diabetes

Diabetes : ఒక‌సారి షుగర్‌ వచ్చిందంటే కోలుకోవడం దాదాపు అసాధ్యం. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు వ్యాయామం ద్వారా కూడా షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. రోజు రోజుకు వీరి సంఖ్య పెరిగిపోతుంది. మామూలుగా అయితే షుగర్‌ ఉన్నవారు తియ్యని పదార్థాల జోలికి వెళ్లరు. అలాగే మధుమేహం ఉన్నవారు అన్నాన్ని కూడా దూరం పెడతారు. మరికొందరు కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తుంటారు. ఉదయం అల్పాహారం, రాత్రి డిన్నర్‌లో కూడా చిరుధాన్యలతో చేసిన ఆహారం తీసుకుంటారు. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, కొర్రలు, అవిసె గింజలు, అరికలు ఎక్కువగా తీసుకుంటారు.

అయితే మొక్కజొన్న విషయానికి వస్తే షుగర్‌ ఉన్నవాళ్లకి మంచిదే అయినా వాటితో చేసిన కార్న్ ఫ్లేక్స్ మాత్రం చాలా ప్రమాద‌క‌ర‌ం అని నిపుణులు అంటున్నారు. అందుకే షుగర్‌ ఉన్నవాళ్లు ఈ కార్న్‌ఫ్లేక్స్‌ జోలికి అస్సలు పోకూడదని హెచ్చరిస్తున్నారు. కార్న్‌ఫ్లేక్స్ చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చూడ‌గానే తినాలనే కోరిక పుడుతుంది. డయాబెటిస్‌ ఉన్నవారు వీటిని తినకూడదని సూచిస్తున్నారు. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ‌గా ఉంటుందని చెబుతున్నారు. జీఐ ఉన్న ఆహారం తీసుకుంటే మన రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. మధుమేహం అదుపుతప్పుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే మధుమేహం ఉన్నవారు కార్న్‌ఫ్లేక్స్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×