E-Paper
Advertisement

Diabetic Eye Disease:- మధుమేహం మీ కళ్లలోనే తెలిసిపోతుంది!

Diabetic Eye Disease:- మధుమేహం మీ కళ్లలోనే తెలిసిపోతుంది!
Advertisement

Diabetic Eye Disease:- ప్రతి ఒక్కరూ ఇప్పుడు మధుమేహంతో బాధపడుతున్నారు. సరైన శారీరక వ్యాయమం లేకపోవడం, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల అనేక మంది మధుమేహ రోగులుగా మారుతున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరూ డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య విఫరీతంగా పెరుగుతోంది.
మామూలు అనారోగ్య సమస్యల్లా మధుమేహం అనేది బయటికి కనిపించదు. రక్త పరీక్షలు చేసుకుంటేనే తెలుస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకుంటూ వారి షుగర్‌ లెవెల్స్‌ను తెలుసుకుంటూ ఉంటారు. జలుబు, జ్వరంలాంటి వాటిలా ఇది బయటకు కనిపించదు. శరీరంలో డయాబెటిస్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ప్రధాన లక్షణాలు మాత్రం తెలుస్తాయి. మధుమేహులకు బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. మనకు తెలియకుండా బాడీలోని పలు అవయవాల మీద ప్రభావం చూపుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగితే కొన్ని సంకేతాలు మనకు తెలుస్తాయి. ముఖ్యంగా మధుమేహుల్లో కంటిచూపు సరిగా ఉండదు. మసకలుగా కనిపిస్తాయి. దీంతో షుగర్‌ లెవల్స్‌ బాగా పెరిగాయని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో చూపు మందగించి, ఎదురుగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తుంటాయి. దీన్ని వెంటనే గుర్తించి వైద్యుడి సూచన మేరకు మందులు వాడుకోవాలి. అలాగే మధుమేహం కాళ్లలోని నరాలను కూడా బాగా దెబ్బతీస్తుంది. అరికాళ్లలోని నరాల్లో విఫరీతంగా నొప్పి ఉన్నా, మంటగా ఉంటే డయాబెటిస్‌ బాగా పెరిగినట్టు అర్థం చేసుకోవాలి. అలాగే పంటి చిగుళ్లలో సమస్యలు ఉన్నా షుగర్‌ పెరిగినట్టే అని వైద్యులు అంటున్నారు. రక్తనాళాలు దెబ్బతింటే మనం చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అందుకే మధుమేహం ఉన్నవారు చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా ముందుగానే జాగ్రత్త పడాలి. మధుమేహం ఉన్నవారు గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Cucumber Juice Benefits : కీరదోస జ్యూస్‌తో శరీరంలో జరిగే మార్పులివే!

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×