BigTV English

Amla Juice:- త్వరగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌ తాగాల్సిందే

Amla Juice:- త్వరగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌ తాగాల్సిందే

Amla Juice:- ఉసిరి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఉసిరితో చేసిన రసాన్ని నిత్యం తాగడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ ఉసిరి జ్యూస్‌ ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్‌ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దీరఘకాలిక వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. వీటితో పాటు ఉసిరి తినడం వల్ల కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉసిరిలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉండటం వల్ల తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మొటిమలను తగ్గించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే నిత్యం మన ఆహారంతో పాటు ఉసిరిని తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ఉసిరికాయ రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రసం తాగడం వల్ల మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఉసిరికాయ రసం బాగా పనిచేస్తుంది. ఉసిరికాయను రోజూ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది. పేగులను శుభ్రపరుస్తుంది, మన శరీరంలోని మలిన పదార్థాలను బయటికి పంపుతుంది. ఉసిరికాయ వల్ల అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి. అలాగే కఫం ఉండదు, మన మేధస్సును పెంచడంతో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది, ఉసిరి తినడం వల్ల వీర్యపుష్టి కలుగుతుంది, త్రిదోషాలు పోతాయని వైద్యులు అంటున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా ఉసిరి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు.


Related News

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Big Stories

×