E-Paper
Advertisement

కళ్లలో మంటలు, దురద వేధిస్తున్నాయా? ఈ 5 కారణాలే మెయిన్ విలన్లు!

కళ్లలో మంటలు, దురద వేధిస్తున్నాయా? ఈ 5 కారణాలే మెయిన్ విలన్లు!

Reasons for dry eyes: రాత్రంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడటం లేదా గంటల తరబడి ల్యాప్‌టాప్‌తో కుస్తీ పట్టడం వల్ల మీ కళ్లు ఎర్రబడి, మంటగా అనిపిస్తున్నాయా? ఏదో నలక పడ్డట్టు మాటిమాటికీ దురద పెడుతున్నాయా? అయితే మీరు ‘డ్రై ఐస్’ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టే. కళ్లలో తేమ తగ్గిపోయినప్పుడు వచ్చే ఈ సమస్యను వదిలించుకోవాలంటే అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాలి. మీ కళ్లను కూల్‌గా, హెల్తీగా ఉంచుకోవడానికి కావాల్సిన అమేజింగ్ టిప్స్ ఈ ఆర్టికల్‌లో మీకోసం.

కళ్లు డ్రైగా, దురదగా మారుతున్నాయా? ఇవే అసలు కారణాలు:

మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం కళ్లు. కానీ మనం వాటికే ఎక్కువ పని చెప్తాం. తక్కువ రక్షణ ఇస్తాం. కళ్లు డ్రైగా మారడం అనేది కేవలం, వయస్సు మళ్లిన వారికి మాత్రమే కాదు, నేటి యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి గల ప్రధాన కారణాలు ఇవే..

1. స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం :
మనం స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కనురెప్పలు వేయడం మర్చిపోతాం. సాధారణంగా నిమిషానికి 15-20 సార్లు రెప్పవేయాలి. కానీ స్క్రీన్ చూస్తున్నప్పుడు అది 5-7 సార్లకు పడిపోతుంది. దీని వల్ల కళ్లలోని కన్నీటి పొర ఆరిపోయి డ్రైనెస్ ఏర్పడుతుంది.

2. ఏసీ ,పర్యావరణం:
ఆఫీసుల్లో లేదా ఇంట్లో గంటల తరబడి ఏసీ కింద కూర్చోవడం వల్ల గాలిలోని తేమ తగ్గిపోతుంది. ఇది కళ్లను త్వరగా డ్రైగా మారుస్తుంది. అలాగే బయట ఉండే దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కళ్లలో అలర్జీలు వచ్చి దురద పుడుతుంది.

3. కాంటాక్ట్ లెన్స్ వాడకం:
స్టైల్ కోసం లేదా సైట్ వల్ల ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల కంటికి ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. లెన్స్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా లేదా వాటిని శుభ్రంగా ఉంచకపోయినా కళ్లలో మంటలు వస్తాయి.

4. ఆహారపు అలవాట్లు , డీహైడ్రేషన్:
శరీరంలో నీటి శాతం తగ్గితే అది కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కన్నీటి గ్రంధులు సరిగ్గా పనిచేయవు. జంక్ ఫుడ్ తినడం కూడా పరోక్షంగా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Also Read: రోజంతా ఉత్సాహంగా ఉండాలా? అయితే మహిళలు ఈ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే!

5. మేకప్, కాస్మెటిక్స్:
కాటుక, ఐ లైనర్ లేదా మస్కారా వంటి ఐ-మేకప్ ప్రొడక్ట్స్ నాణ్యత లేకపోయినా.. లేదా రాత్రి పడుకునే ముందు వాటిని సరిగ్గా తొలగించకపోయినా కళ్లలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

నివారణ మార్గాలు:
20-20-20 రూల్: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి.

కళ్లపై చన్నీళ్లు: మధ్యమధ్యలో కళ్లను చల్లటి నీటితో కడుక్కోండి.

హైడ్రేషన్: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి.

సరైన నిద్ర: కళ్లు కోలుకోవడానికి కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×