E-Paper
Advertisement

ఎలుకల రంధ్రం వర్సెస్ పాము రంధ్రం.. ఈ చిన్న తేడాలు తెలిస్తే మీరు సేఫ్!

ఎలుకల రంధ్రం వర్సెస్ పాము రంధ్రం.. ఈ చిన్న తేడాలు తెలిస్తే మీరు సేఫ్!
Advertisement

Snake Hole Vs Rodent Hole: మీ గార్డెన్‌లో అప్పుడప్పుడు కొన్ని కన్నాలు కనిపించి మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నాయా? అవి ఎలుకలు చేసినవా లేక పాములు ఉన్నవా అని డిసైడ్ చేయలేక బుర్ర పాడైపోతుందా? డోంట్ వర్రీ. పాములకు స్వయంగా కన్నాలు తవ్వే అలవాటు ఉండదు. అవి ఎలుకలు చేసిన రంధ్రాల్లోనే తిష్ట వేస్తాయి. కానీ కొన్ని చిన్న చిన్న గుర్తుల ద్వారా అది పాము నివాసమా లేక ఎలుకల అడ్డానా అని ఈజీగా కనిపెట్టవచ్చు. మీ సేఫ్టీ కోసం ఈ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ టిప్స్ ఓసారి చూసేయండి.

రంధ్రం పాముదా లేక ఎలుకదా? ఎలా గుర్తించాలి ?

గార్డెనింగ్ చేసేటప్పుడు నేలపై రంధ్రాలు కనిపిస్తే భయపడటం సహజం. అయితే ప్రతి రంధ్రం పాముదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండటం మాత్రం ముఖ్యం. ఎలుకలు, పాములు రంధ్రాలను ఉపయోగించే విధానంలో చాలా తేడాలు ఉంటాయి.

Advertisement

1. రంధ్రం ఆకారం, పరిమాణం:
ఎలుకల రంధ్రాలు సాధారణంగా కొంచెం గరుకుగా, చిందర వందరగా ఉంటాయి. ఇవి సుమారు 2 నుంచి 3 ఇంచుల వరకు ఉంటాయి. రంధ్రం చుట్టూ ఎలుకలు తమ పళ్లతో లేదా గోళ్లతో తవ్విన గుర్తులు కనిపిస్తాయి.

పాములు ఉన్న రంధ్రాలు మాత్రం చాలా “నీట్” గా ఉంటాయి. పాములు రంధ్రాలను తవ్వవు కాబట్టి.. ఆ కన్నం అంచులు మృదువుగా కనిపిస్తాయి. రంధ్రం లోపలికి వెళ్లే దారి క్లియర్‌గా ఉంటే.. అది పాముదయ్యే అవకాశం ఉంది.

Advertisement

2. చుట్టూ ఉన్న మట్టిని గమనించండి:
ఎలుకలు రంధ్రం తవ్వినప్పుడు లోపలి మట్టిని బయటకు నెట్టేస్తాయి. కాబట్టి రంధ్రం బయట చిన్న మట్టి దిబ్బలు లేదా వదులుగా ఉన్న మట్టి కనిపిస్తే అది ఖచ్చితంగా ఎలుక చేసిన పనే.
పాములు వేరే జంతువులు వదిలేసిన రంధ్రాల్లోకి వెళ్తాయి కాబట్టి.. వాటి రంధ్రాల వద్ద ఎలాంటి కొత్త మట్టి కుప్పలు ఉండవు. రంధ్రం చుట్టూ మట్టి చెల్లాచెదురుగా లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండాలి.

3. ఇతర గుర్తులు:
ఎలుకలు: రంధ్రం చుట్టూ చిన్న చిన్న దారిలు ఉండటం, మొక్కల ఆకులు లేదా వేర్లు కొరికినట్లు ఉండటం ఎలుకల ఉనికిని సూచిస్తుంది.

పాములు: రంధ్రం దగ్గర పాము విడిచిన కుబుసం,మృదువైన పాము చారలు లేదా ముదురు రంగులో ఉండి తెల్లటి టిప్ ఉండే రెట్టలు కనిపిస్తే అక్కడ పాము ఉందని అర్థం.

Also Read: రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోర్ క్లీనర్ తయారీ.. దీంతో మీ ఇల్లు మెరిసిపోవడం గ్యారెంటీ!

4. పాములు ఎందుకు ఎలుకల రంధ్రాల్లో ఉంటాయి?
పాములకు బొరియలు తవ్వే శక్తి ఉండదు. అవి ఎలుకలను వేటాడటానికి వాటి రంధ్రాల్లోకి వెళ్తాయి. ఒక వేళ ఎలుకను తినేస్తే.. ఆ ఖాళీ రంధ్రాన్నే తమ నివాసంగా మార్చుకుంటాయి. అంటే ఎలుకలు ఉన్న చోట పాములు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మీ గార్డెన్‌లో ఆహారం (ఎలుకలు), నీరు, దాక్కునే చోటు ఉంటే పాములు అక్కడే సెటిల్ అయిపోతాయి.

5. తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
గుర్తు తెలియని రంధ్రాల్లో ఎప్పుడూ చేతులు పెట్టకండి. ఒకవేళ అది పాము రంధ్రం అని మీకు అనుమానం కలిగితే.. దాన్ని కర్రతో కెలికే ప్రయత్నం చేయకండి. మీ గార్డెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, ఎండుటాకులు లేదా చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం వల్ల పాములు రాకుండా నివారించవచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×