E-Paper
Advertisement

మనిషి 200 జీవించడం సాధ్యమే? గేమ్ ఛేంజర్ కొత్త ప్రొటీన్

మనిషి 200 జీవించడం సాధ్యమే? గేమ్ ఛేంజర్ కొత్త ప్రొటీన్
Advertisement

ప్రతి మనిషికి వీలైనంత ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది. అందుకోసమే శాస్త్రవేత్తలు ప్రకృతి రహస్యాలను ఉపయోగించి మనుషుల జీవిత కాలాన్ని పెంచే మార్గాలను వెతుకుతున్నారు. ఇటీవలే ఒక అధ్యయనం ద్వారా ఒక అద్భుత ప్రొటీన్ మనుషులు ఎక్కువ కాలం జీవించేందుకు సాయపడగలదని తెలిసింది. అయితే ఈ ప్రొటీన్ అంత ఈజీగా లభించదు. సముద్ర గర్భంలో మాత్రమే దొరుకుతుంది.

బౌహెడ్ అనే తిమింగలం ద్వారా లభించే ప్రొటీన్ మనిషి దీర్ఘకాలం జీవించేందుకు సాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ జంతువు 200 సంవత్సరాలకు మించి జీవించగలదు. రాచెస్టర్ యూనివర్సిటీ ఈ అధ్యయనం చేసింది.

బౌహెడ్ తిమింగలాలు ఎలా ఇంత కాలం జీవిస్తాయి

Advertisement

బౌహెడ్ తిమింగలాలు భూగ్రహంపై నివసించే అతి దీర్ఘాయుష్షు కలిగిన క్షీరదాలు. ఇవి రెండు శతాబ్దాలకు మించి జీవించగలవు. అది కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీని వెనుక కారణం తెలుసుకునేందుకు కొత్తగా పరిశోధన జరిగింది. వాటి దీర్ఘాయుష్షు రహస్యాన్ని అర్థం చేసుకోవాలని శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. వాటి శరీరం బిలియన్ల కొద్దీ కణాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ క్యాన్సర్ లేదా తీవ్రమైన వ్యాధులు వాటికి అరుదుగా వస్తాయి. ఈ అసాధారణ విషయాన్ని ‘పీటో’స్ పారడాక్స్’ అంటారు.

సిఐఆర్‌బిపి ప్రోటీన్ పాత్ర

పరిశోధకులు సిఐఆర్‌బిపి అనే ప్రత్యేక ప్రోటీన్‌ను కనుగొన్నారు. ఈ ప్రోటీన్ కణాలలో దెబ్బతిన్న డిఎన్ఏను మరమ్మత్తు చేస్తుంది. డిఎన్ఏ దెబ్బతినడం వృద్ధాప్యం, వ్యాధులకు దారి తీస్తుంది. బౌహెడ్ తిమింగలాలలో ఈ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషుల కంటే సుమారు 100 రెట్లు ఎక్కువ సిఐఆర్‌బిపి ఉంటుంది. ఇది వాటి కణాలు దెబ్బలను త్వరగా, సరిగ్గా సరిచేయడానికి సహాయపడుతుంది.

డిఎన్ఏ మరమ్మత్తు జీవిత కాలాన్ని ఎలా మెరుగుపరుస్తుంది

Advertisement

డిఎన్ఏ దెబ్బతినడం అన్ని జీవులలో సహజంగా జరుగుతుంది. సరైన మరమ్మత్తు లేకపోతే వృద్ధాప్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. బౌహెడ్ తిమింగలాలు ఇతర జంతువుల కంటే డిఎన్ఏ చాలా సమర్థవంతంగా సరిచేస్తాయి. వాటి కణాలు స్థిరత్వం కాపాడుకుని హానికరమైన మ్యుటేషన్లను నివారిస్తాయి. ఈ బలమైన రిపెరింగ్ సిస్టమ్ వాటి దీర్ఘాయుష్షుకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆశాజనక ఫలితాలు

శాస్త్రవేత్తలు ఈ ప్రోటీన్‌ను మానవ కణాలలో పరీక్షించారు. సిఐఆర్‌బిపి జోడించడంతో డిఎన్ఏ రిరేర్ సిస్టమ్ మెరుగుపడింది. కణాలలో దెబ్బలు తగ్గాయి. ఫ్రూట్ ఫ్లైస్‌పై (ఈగలు) కూడా పరీక్షించారు. ఈ ప్రోటీన్ ఇచ్చిన ఈగలు ఎక్కువ కాలం జీవించాయి. ఈ ప్రొటీన్ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుందని తేలింది.

మనుషులు 200 సంవత్సరాలు జీవించగలరా?

ఈ ఆవిష్కరణ మనుషుల జీవిత కాలాన్ని పొడిగించడానికి సహాయపడవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే 200 సంవత్సరాలు జీవించడం గురించి ఇంకా నిర్ధారణ కాలేదు. మానవ వృద్ధాప్యాన్ని బయోలాజికల్, పర్యావరణ కారకాలు ప్రభావితం చేస్తాయి. ఈ ప్రోటీన్‌ను మనుషులపై ఉపయోగించే ముందు మరిన్ని అధ్యయనాలు అవసరం. డిఎన్ఏ మరమ్మత్తు సిస్టమ్ మెరుగుపరిచే చికిత్సలను అభివృద్ధి చేయాలని లక్ష్యం.

Also Read: గంటలపాటు జిమ్‌ చేసినా బరువు తగ్గడం లేదా? అందరూ చేసే తప్పులివే..

పరిశోధనలో సమస్యలు

మనుషుల శరీరం తిమింగలాల నుంచి చాలా వేరు. ఈ ప్రోటీన్‌ నేరుగా వినియోగించడం సులభం కాదు. సంవత్సరాల పాటు పరీక్షలు, భద్రతా తనిఖీలు అవసరం. అనవసర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. డిఎన్ఏ రిపేర్ మరీ ఫాస్ట్‌గా పనిచేస్తే శరీర ప్రక్రియలను ప్రభావితం చేయవచ్చు. అయితే ఈ పరిశోధనలో ఎదురయ్యే సమస్యలు అన్ని పరిష్కారమైతే మానవ ఆయుషు పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×