E-Paper
Advertisement

గంటలపాటు జిమ్‌ చేసినా బరువు తగ్గడం లేదా? అందరూ చేసే తప్పులివే..

గంటలపాటు జిమ్‌ చేసినా బరువు తగ్గడం లేదా? అందరూ చేసే తప్పులివే..
Advertisement

Weight loss mistakes diet exercise| చాలా మంది డైటింగ్ పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తున్నా.. బరువు తగ్గడం లేదని బాధపడతారు. ఇది చాలా నిరాశ, గందరగోళాన్ని కలిగిస్తుంది. అసలు సమస్య మీరు చేసే చిన్న తప్పుల్లో దాగి ఉంటుంది. ఈ తప్పులను అర్థం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.

సరైన మొతాదులో క్యాలరీలు తీసుకోవడం

బరువు తగ్గాలంటే సరైన క్యాలరీ సమతుల్యత అవసరం. ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే కొవ్వు తగ్గదు. చాలా తక్కువ క్యాలరీలు తీసుకుంటే జీవక్రియ నెమ్మది అవుతుంది. ఇది ఆకలిని పెంచి, శక్తిని తగ్గిస్తుంది.

 వెయిట్ మెషీన్‌పై ఆధారపడితే తప్పు చేసినట్లే

Advertisement

చాలా మంది బరువు తగ్గడాన్ని కేవలం స్కేల్ బరువుతోనే అంచనా వేస్తారు. నీటి బరువు, ఆహారం, హార్మోన్ల వల్ల బరువు ప్రతి రోజు మారుతుంది. ఒకవేళ కొవ్వు తగ్గినా స్కేల్‌లో మార్పు కనిపించకపోవచ్చు. దీనికి బదులుగా శరీరం కొలతలు, బట్టలు లూజ్‌గా ఉన్నాయా? లేదా టైట్‌గా ఉన్నాయో సరిచూసుకోండి.చూడండి.

ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం

బరువు తగ్గడంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఆకలిని అదుపు చేసి, ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ప్రోటీన్ తక్కువగా ఉంటే పురోగతి నెమ్మది అవుతుంది. డైట్ చేసేటప్పుడు కండరాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

కేవలం కార్డియో వ్యాయామం మాత్రమే చేయడం

Advertisement

కార్డియో మాత్రమే చేయడం బరువు తగ్గడానికి సరిపోదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కండరాలను పెంచి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఎక్కువ కండరాలు ఉంటే విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ క్యాలరీలు కాలిపోతాయి. సమతుల్య వ్యాయామ ప్రణాళిక ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం

ప్యాకెట్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవని లేదా లో-ఫ్యాట్ అని లేబుల్ వేసి అమ్ముతారు. వీటిలో దాగి ఉన్న షుగర్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని పెంచి, అధికంగా తినేలా చేస్తాయి. ఇవి బరువుని పెంచుతాయి. అందుకే సహజమైన ఆహారాలు ఎప్పుడూ మంచివి.

వ్యాయామం వల్ల కరిగే క్యాలరీలను అంచనా వేయడం

వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చుఅవుతాయని అనుకుంటారు. దీని వల్ల వ్యాయామం తర్వాత ఎక్కువ ఆహారం తింటారు. ఫలితంగా బరువు తగ్గడం ఆగిపోతుంది లేదా నెమ్మది అవుతుంది. అందుకే నిజమైన క్యాలరీ బర్నింగ్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం.

మీ రొటీన్‌లో స్థిరత్వం లేకపోవడం

బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా ప్రయత్నం అవసరం. వ్యాయామం లేదా డైట్ స్కిప్ చేయడం పురోగతిని దెబ్బతీస్తుంది. అనియమిత అలవాట్లు శరీరాన్ని గందరగోళానికి గురి చేస్తాయి. తీవ్రత కంటే స్థిరత్వం ముఖ్యం.

ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం

అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం సులభంగా అధికంగా తినేలా చేస్తుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీసి, క్యాలరీలు పెంచుతుంది. ఈ ఫుడ్స్ మీ జీవక్రియను దెబ్బతీస్తాయి. అందుకే నేచురల్ ఫుడ్స్ తినడం అలవాటుగా చేసుకోండి.

Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

ఫైబర్ తక్కువగా తీసుకోవడం

మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉంటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. పైగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఫైబర్ తక్కువగా ఉంటే ఆకలి, క్రేవింగ్స్ ఎక్కువవుతాయి. దీని వల్ల రోజువారీ క్యాలరీలు పెరుగుతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి.

త్వరగా ఫలితాలు ఆశించడం

చాలా మంది డైట్ చేస్తే త్వరగా బరువు తగ్గాలని ఆశిస్తారు. బరువు తగ్గడం నెమ్మదిగా, స్థిరంగా జరిగే ప్రక్రియ. శరీరం కాలక్రమేణా అలవాటు పడి బరువు తగ్గవచ్చు. దీర్ఘకాలిక విజయం కోసం ఓర్పు అవసరం.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×