E-Paper
Advertisement

Cockroaches Food: బొద్దింకలు మనుషులను తింటాయా? వాటికి ఏయే శరీర భాగాలు ఇష్టమంటే?

Cockroaches Food: బొద్దింకలు మనుషులను తింటాయా? వాటికి ఏయే శరీర భాగాలు ఇష్టమంటే?

డైనోసార్‌ను చూసినా భయపడని అమ్మాయిలు.. చిన్న బొద్దింకను చూసి హడలిపోతుంటారు. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ విషయాలు తెలిస్తే.. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా వణికిపోతారు. ఎందుకంటే అవి మనం ఇంట్లో వదిలేసే ఆహారమే కాదు.. మనల్ని కూడా అవి తినేస్తాయట. ఇది కాస్త నమ్మబుద్ధికాకపోయినా.. ఇది నిజం. అయినా, అంత చిన్న బొద్దింక మనల్ని ఎలా తినేస్తుంది? వెటకారం కాకపోతే అనుకుంటున్నారా? అది కూడా నిజమే.. అవి మనల్ని తింటాయి అంటే మొత్తం మనిషిని నమిలి తినేయడం కాదు. వాటికి ఎంత కావాలో అంతే తింటాయి. అది మనకు చీమ కుట్టినట్లు కూడా అనిపించదు.

బొద్దింకలు ఏం తింటాయి?

సాధారణంగా బొద్దింకలు.. ఆహార పదార్థాలు, మలం, వ్యర్థాలు తింటుంటాయి. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు చనిపోయిన పురుగులను తింటాయి. మరీ ఆకలి ఎక్కువగా ఉంటే.. బతికున్న జీవులను కూడా తినేస్తాయట. చివరికి మనల్ని కూడ అవి వదిలిపెట్టవట.

మనుషులను తినేస్తాయా? అదెలా?

బొద్దింకలు మనుషులను తినేస్తాయా అంటే.. అది వాటి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని బొద్దింకలు నరమాంస భక్షకులని చెప్పలేం. కానీ, కొన్ని బొద్దింకలు తప్పని పరిస్థితుల్లో మనుషుల చర్మాన్ని కొరుక్కుతింటాయని పరిశోధకులు చెబుతున్నారు. అంటే.. దోమల తరహాలో. ఆహారం కోసం అవి మన శరీరంపై ఆధారపడతాయే గానీ.. ఉన్మాదుల్లా వేటాడి వెంటాడి తినేయవు. కాబట్టి.. కాసేపు ఊపిరి పీల్చుకోండి.

కానీ, జాగ్రత్త.. లైట్ తీసుకంటే వ్యాధులే..

బొద్దింకలను పెట్స్‌లా ఇంట్లో పెంచుకోవద్దు. అవి ఒక్కసారి మన శరీరాన్ని తినడానికి అలవాటు పడ్డాయంటే.. అదే పనిగా తింటూనే ఉంటాయి. మనలో అవి కొన్ని పార్ట్స్‌ను బాగా ఇష్టపడతాయి. కంటి రెప్పలు, చేతి గోర్లు, కాళ్లు.. చేతులపై ఉండే డెడ్ స్కిన్ అంటే వాటికి చాలా ఇష్టం. అవి వాటిని కొరుక్కు తింటాయి. బొద్ది కరిచిన చోట చర్మం ఎర్రగా మారుతుంది. అక్కడ దురద పెడతుంది. చర్మం కాస్త ఉబ్బుతుంది కూడా. కొందరికి ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం కూడా ఉందట.

శవాలను తింటాయా?

పైన బొద్దింకలు గురించి చదువుతుంటే.. అంతగా భయం వేయకపోవచ్చు. కానీ, ఈ విషయాలు తెలిస్తే మాత్రం.. లైటుగా భయపడతారు. బొద్దింకలు శవాలను చూస్తే వదిలిపెట్టవు. వాటికి డెడ్ స్కిన్ అంటే చాలా ఇష్టం. అందుకే.. శవం కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తమకు తోచినంత తింటాయి. శవం కుళ్లిపోయేకొద్ది మరింత ఇష్టంగా తింటాయి. ఎందుకంటే.. బొద్దింకలకు ఏదీ ఫ్రెష్‌గా ఉంటే ఇష్టం ఉండదు. కుళ్లిన పదార్థం మెత్తగా మారుతుంది. కాబట్టి, తినడానికి అనుకూలంగా ఉంటుంది. బలమైన కండరాలను అవి తినలేవు. మన శరీరంలో సాఫ్టుగా ఉండే పార్టులను మాత్రమే తినగలవు. బొద్దింకలు మీ వరకు రాకూడదు అంటే మీరు, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. లేకపోతే.. వాటిని డిన్నర్‌కు ఆహ్వానించినట్లే.

బొద్దింకలకు ఇష్టమైన ఫుడ్ ఏమిటీ?

‘‘ఫేవరెట్ ఫుడ్ అనేది కేవలం మీ మనుషులకేనా? ఏ… మాకు ఉండకూడదా?’’ అని బొద్దింకలు మిమ్మల్ని ప్రశ్నించే లోపే.. వాటికి ఏం ఇష్టమో తెలుసుకోండి. వాటిని దూరం పెట్టడం ద్వారా మీరు బొద్దింకల బెడద నుంచి తప్పించుకోవచ్చు. బొద్దింకలకు చక్కెర, స్వీట్లు అంటే చాలా ఇష్టం. చక్కెర వాటికి బోలెడంత ఎనర్జీని ఇస్తుంది. క్యాండీలు, చాక్లెట్లు, కేకులు, కుకీస్ బయట వదిలేస్తే.. మీ కంటే ముందే అవి టేస్ట్ చేసేస్తాయి. కాబట్టి, వాటిని ఎక్కడపడితే అక్కడ వదిలేయకండి. బొద్దింకలకు పండ్లు కూడా ఇష్టమే. ద్రాక్ష పండ్లు, పుచ్చకాయ, అరటి పండ్లను ఎక్కువగా తింటాయి. ఇవి కాకుండా.. బ్రెడ్, పాస్తా, బియ్యం, బంగాళా దుంపలు.. ఇలా ఒక్కటేమిటీ ఇలా చెబుతూ పోతే మెనూ పెద్దదై పోతుంది. చివరికి అవి కార్డుబోర్డు బాక్సులు, జిగురు, సబ్బు, టూత్ పేస్ట్, పేపర్ సైతం వదిలిపెట్టవంటే నమ్మండి. ఒక బలహీన క్షణంలో అవి.. చనిపోయిన తోటి బొద్దింకలను కూడా తినేస్తాయట. బొద్దింకల ఇష్టాయిష్టాల గురించి తెలుసుకున్నారుగా.. ఇకపై జాగ్రత్తగా ఉండండి.

Also Read: బజారులో బ్యాండ్ బాజా.. జస్ట్, ఈ మార్కెట్‌కు వెళ్తే చాలు పెళ్లయిపోతుంది, ఎక్కడంటే?

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×