E-Paper
Advertisement

Coconut Water: రోజులో కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?

Coconut Water: రోజులో కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?
Advertisement

వేసవి కాలం వచ్చేసింది. కొబ్బరినీళ్లు తాగే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎంతోమంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి, కడుపు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు సాధారణంగా ఎంతో మందిలో కనిపిస్తున్నాయి. జీవనశైలి మార్పులు, బయట ఆహారం ఎక్కువగా తినడం, నీరు తక్కువగా తాగడం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో సహజమైన పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, తేలికపాటి పొట్ట ఇన్ఫెక్షన్ సమయంలో కొబ్బరి నీళ్లు ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి.

కొబ్బరినీళ్లు ఎందుకు తాగాలి?
కొబ్బరి నీళ్లలో సహజ ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలో నీటి లోపం తగ్గితే జీర్ణక్రియ కూడా సరిగా జరుగుతుంది. పొట్ట ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాంతులు, విరేచనాలు కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి నీరు, శక్తి రెండూ లభిస్తాయి. అందుకే అనేక మంది డాక్టర్లు కూడా జ్వరాలు లేదా కడుపు సమస్యల సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలని చెబుతుంటారు. ఇది తేలికగా జీర్ణమయ్యే పానీయం కావడంతో పొట్టపై ఒత్తిడి పెరగదు.

Advertisement

Also read: Liver Health: ఇంట్లో ఉన్న పచ్చిపసుపును ఇలా వాడితే మీ కాలేయం శుభ్రపడిపోతుంది

ఛాతీ మంట తగ్గిస్తుంది
గ్యాస్, అసిడిటీ సమస్యలలో కూడా కొబ్బరి నీళ్లు కొంత ఉపశమనం ఇస్తాయని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు స్వల్పంగా ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే కడుపులో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల ఛాతి మంట, కడుపు మంట వంటి లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. వేసవిలో లేదా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తాగితే కడుపు మంట తగ్గుతుంది. సహజ చక్కెరలు ఉండటం వల్ల శక్తి కూడా అందుతుంది. కడుపు బలహీనంగా ఉన్నప్పుడు ఘన ఆహారం తినలేని పరిస్థితి వచ్చినా, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొంత శక్తి పొందవచ్చు.

Advertisement

వీటిని ఎప్పుడు తాగాలి?
కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. నిపుణులు చెబుతున్న ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. భోజనం తర్వాత కొద్దిసేపటికి తాగితే జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగడం కొందరికి అసౌకర్యం కలిగించవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు తాగితే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. అందుకే రోజుకు ఒక గ్లాస్ పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. మధుమేహం, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కొబ్బరి నీళ్లు పొట్ట ఆరోగ్యానికి సహజమైన, తేలికపాటి పోషక పానీయంగా చెప్పుకోవాలి. గ్యాస్, అసిడిటీ, చిన్నపాటి పొట్ట ఇబ్బందుల సమయంలో ఉపశమనం ఇవ్వడంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోవడం కంటే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. సరైన ఆహారం, తగినంత నీరు, వ్యాయామంతో పాటు కొబ్బరి నీళ్లు మితంగా తీసుకుంటే కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×