E-Paper
Advertisement

Liver Health: ఇంట్లో ఉన్న పచ్చిపసుపును ఇలా వాడితే మీ కాలేయం శుభ్రపడిపోతుంది

Liver Health: ఇంట్లో ఉన్న పచ్చిపసుపును ఇలా వాడితే మీ కాలేయం శుభ్రపడిపోతుంది
Advertisement

ఆధునిక జీవనశైలి, బయట ఆహారాన్ని అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య పెరిగిపోతోంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అలసట, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లివర్ సంబంధిత మరింత తీవ్రమైన సమస్యలు రావచ్చు. అందుకే కాలేయం కోసం వైద్య చికిత్సతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో ఉండే పచ్చి పసుపుతోనే మీ కాలేయాన్ని కాపాడుకోవచ్చు.

పసుపు ఎలా కాపాడుతుంది?
పసుపు మన వంటింట్లో తరచుగా ఉపయోగించే పదార్థమే. కానీ పచ్చి పసుపులో ఉండే పోషకాలు ఎంతో అధ్భుతమైనవి. ఇందులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కణాలను రక్షిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యలో లివర్ కణాల్లో వాపు, కొవ్వు నిల్వలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో పచ్చి పసుపు తీసుకోవడం వల్ల వాపు తగ్గి లివర్ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పచ్చి పసుపు శరీరంలోని టాక్సిన్లను తగ్గించి రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా లివర్‌పై ఉండే ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Also read: Protein Dosa: ప్రతి ఉదయం ఇలాంటి ప్రొటీన్ దోశ తింటే రోజంతా ఆరోగ్యమే

ఎలా తీసుకోవాలి?
పచ్చి పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో పచ్చి పసుపు కలిపి తాగవచ్చు. కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపితే రుచి కూడా మెరుగుపడుతుంది. రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పాలలో పచ్చి పసుపు కలిపి తాగడం కూడా మంచిదే. అలాగే కూరలు, చట్నీలు, సూప్‌లలో తురిమిన పసుపు వేసి వాడవచ్చు. పసుపుతో పాటు చిటికెడు మిరియాల పొడి కలిపితే కర్క్యుమిన్ శరీరంలో బాగా ఇంకుతుంది. ఈ చిన్న అలవాట్లు పాటించడం వల్ల లివర్ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.

Advertisement

Also read: Green Mirchi Halwa: పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తారు తెలుసా? తింటే అదిరిపోతుంది కూడా

మరీ అధికంగా తినకండి
పచ్చి పసుపు ఆరోగ్యానికి మంచిదని చెప్పి అధికంగా తీసుకోవడం సరికాదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొంతమందికి పొట్ట అసౌకర్యం లేదా ఇతర సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఇప్పటికే లివర్ వ్యాధులు, గర్భధారణ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. అలాగే పసుపు సప్లిమెంట్లు స్వయంగా తీసుకోవడం కంటే ఆహార రూపంలో తీసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే పచ్చి పసుపు ఫ్యాటీ లివర్ ఉన్నవారికి సహాయక ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణతో పాటు పచ్చి పసుపును మితంగా తీసుకుంటే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×