E-Paper
Advertisement

Kamal Haasan vs Rajinikanth Networth: రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్..2026లో ఎవరి నెట్ వర్త్ ఎంతంటే..?

Kamal Haasan vs Rajinikanth Networth: రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్..2026లో ఎవరి నెట్ వర్త్ ఎంతంటే..?
Advertisement

Kamal Haasan vs Rajinikanth Networth: భారతీయ సినిమా చరిత్రలో అత్యంత పాపులర్ అయిన ఇద్దరు దిగ్గజ నటులు రజనీకాంత్ మరియు కమల్ హాసన్. వీరి సినిమాలే కాదు, వారి సంపాదన, ఆస్తులు కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా.. ఉంటాయి. 2026లో ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారన్న ప్రకటనతో, వారి నెట్ వర్త్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

కమల్ హాసన్ ఆస్తుల వివరాలు..!

తాజా నివేదికల ప్రకారం..కమల్ హాసన్ నెట్ వర్త్ సుమారు రూ.410 కోట్ల నుంచి రూ.450 కోట్లకు పైగా ఉందని అంచనా. ఆయన నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. కమల్ హాసన్ తన స్వంత నిర్మాణ సంస్థ Raaj Kamal Films International ద్వారా సినిమాలు నిర్మిస్తారు. అలాగే టెలివిజన్ రంగంలో కూడా ఆయన బిజీగా ఉంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ తమిళ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ, రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం.

రజినీకాంత్ ఆస్తుల వివరాలు..!

Advertisement

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే, ఆయన నెట్ వర్త్ సుమారు రూ.430 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పైగా ఉందని చెబుతున్నారు. రజనీకాంత్ ఆదాయానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే భారీ నట ఫీజులే. ఒక్కో సినిమాకు ఆయన రూ.125 కోట్ల నుంచి రూ.270 కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టుల కోసం ఈ మొత్తం రూ.200 కోట్లను కూడా దాటిందని ప్రచారం. దీనితో రజనీకాంత్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు.

ఆస్తుల విషయానికి వస్తే, రజనీకాంత్ చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఉన్న ఆయన ఇంటి విలువ సుమారు రూ.35 నుంచి రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే కోడంబాక్కంలో ఉన్న రాఘవేంద్ర కళ్యాణ మండపం, పుణె సమీపంలోని పూర్వీకుల ఆస్తులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. మరోవైపు, కమల్ హాసన్‌కు చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.131 కోట్లకు పైగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. చెన్నైతో పాటు ఇతర నగరాల్లో కూడా ఆయనకు ఇళ్లు ఉన్నాయి.

Advertisement

ఇద్దరి కెరీర్ దారులు వేర్వేరైనా, ఆర్థికంగా మాత్రం ఇద్దరూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నారని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరు మాస్ ఇమేజ్‌తో భారీ ఫీజులు సంపాదిస్తే, మరొకరు నటనతో పాటు నిర్మాణం, టెలివిజన్ రంగాల్లో విస్తరించి ఆదాయం పొందుతున్నారు. త్వరలో రాబోయే వారి కలయిక సినిమా ప్రేక్షకుల్లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా భారీ ఆసక్తిని కలిగిస్తోంది.

ALSO READ: Romantic Action Thriller : లోయలో లవ్.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే బెస్ట్ యాక్షన్ మూవీ ఇది, డోన్ట్ మిస్

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×